India vs England 3rd Test 2021: మూడో టెస్టులో భారత్ ఓటమి, ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్, రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైన టీంఇండియా, సిరీస్‌ 1-1తో సమం
ENG Win By An Innings And 76 Runs

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీంఇండియా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం (ENG Win By An Innings And 76 Runs) సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 212/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ (India vs England 3rd Test 2021 Day 4 ) తొలి సెషన్‌లోనే మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మ్యాచ్‌ ప్రారంభమైన పది నిమిషాల నుంచే భారత్ వికెట్ల పతనం మొదలైంది.

ఆదిలోనే పుజారా (91) రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి శతకం చేజార్చుకున్నాడు. కాసేపటికే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(55) అర్ధశతకం సాధించినా రాబిన్‌సన్‌ బౌలింగ్‌లోనే స్లిప్‌లో రూట్‌ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 237/4గా నమోదై కష్టాల్లో పడింది. ఆపై వైస్‌ కెప్టెన్‌ రహానె(10), పంత్‌(1), షమి(6), ఇషాంత్‌(2), జడేజా(30), సిరాజ్‌(0) కనీస పోరాటం చేయకుండా వెనుదిరిగారు. బుమ్రా(1) నాటౌట్‌గా నిలిచాడు. చివరికి భారత్‌ 99.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ ఐదు వికెట్లు తీయగా ఓవర్టన్‌ మూడు తీశాడు. అలాగే అండర్సన్‌, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ సాధించారు.

ఆఫ్ఘ‌న్ల‌ను చంప‌డం ద‌య‌చేసి ఆపండి, ట్విట్టర్ ద్వారా వేడుకున్న ఆఫ్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లు ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ, ఆఫ్ఘ‌న్ల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌పంచ నేత‌ల‌ను వేడుకుంటున్న స్టార్ క్రికెటర్లు

అంతకుముందు మూడో రోజు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(59), పుజారా అర్ధశతకాలతో రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. కఠిన పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. దాంతో భారత్‌ మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి 212/2 స్కోర్‌తో నిలిచి మ్యాచ్‌లో పోరాటం చేసేలా కనిపించింది. ఈ క్రమంలోనే నాలుగో రోజు కూడా ఇలాగే ఆడితే మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుందని అంతా ఆశించారు. కానీ, భారత బ్యాట్స్‌మెన్‌ నాలుగో రోజు ఆడలేకపోయారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి కోహ్లీసేనను కట్టడి చేశారు.

స్కోరుబోర్డు వివరాలు:

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 78 ఆలౌట్‌,

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 432 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 278 ఆలౌట్‌