India vs New Zealand 2nd ODI: New Zealand beat India by 22 runs to seal series 2-0 (Photo-IANS)

Auckland, Febuary 8: ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs NZ 2nd ODI) న్యూజిలాండ్ 22పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది. టీ20సిరీస్ గెలుచుకున్న భారత్ (India) కివీస్‌కు (New Zealand) వన్డే సిరీస్ ను అప్పజెప్పినట్లు అయింది. ఇప్పటికే రెండు వన్డేలను ఓడిన భారత్ మూడో వన్డేను నామమాత్రంగా మార్చివేసింది. పరువు కాపాడుకోవడానికి కోహ్లీసేన క్లీన్ స్వీప్ కోసం కివీస్ లు మంగళవారం ఉదయం 7గంటల 30నిమిషాలకు ఓవల్ స్టేడియం వేదికగా మూడో వన్డేలో తలపడనున్నాయి.

భారత ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మరోసారి తన బ్యాటింగ్‌తో జట్టును విజయానికి దగ్గరగా తీసుకువచ్చినా మిగిలిన ఆటగాళ్ల సహాకారం కరువైంది. చివర్లో నవదీప్‌ సైనీ తన మెరుపు బ్యాటింగ్‌తో గెలుపుపై ఆశలు చిగురించినా కైల్‌ జేమిసన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అవడంతో టీమిండియా పరాజయం ఖాయమైంది. ఇక చివర్లో ఒత్తిడిని జయించలేక 48.3 ఓవర్లలో 251 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది.

భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 55, శ్రేయస్‌ అయ్యర్‌ 52, నవదీప్‌ సైనీ 45 పరుగులతో రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో బెన్నెట్‌, సౌదీ, జేమిసన్‌, కొలిన్‌ డి ఇంగ్రామ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

తడబడిన ఇండియా, పుంజుకున్న కివీస్

అంతకుమందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో గప్టిల్‌ 79, రాస్‌ టేలర్‌ 73, నికోల్స్‌ 45 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో చాహల్‌ 3వికెట్లు, శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు తీశారు. కాగా నామమాత్రంగా మారిన మూడో వన్డే ఫిబ్రవరి 11న మౌంట్‌ మాంగనూయిలో జరగనుంది.

Here's BCCI Tweet

కాగా ఇప్పటివరకూ ఇరు దేశాల వన్డే చరిత్రలో కివీస్‌ గడ్డపై భారత్‌ తొలి వన్డేలో పరాజయం చూసిన తర్వాత సిరీస్‌ను గెలుచుకున్న దాఖలాలు లేవు. గతంలో న్యూజిలాండ్‌లో భారత్‌ రెండు వన్డే సిరీస్‌లను మాత్రమే గెలిచింది. 2008-09లో 3-1 తేడాతో కివీస్‌పై గెలిచిన టీమిండియా.. 2019లో 4-1తో సిరీస్‌ను దక్కించుకుంది. అయితే ఈ రెండు సందర్భాల్లో భారత్‌ తొలి వన్డేలో గెలిచిన తర్వాతే న్యూజిలాండ్‌ గడ్డపై సిరీస్‌లను కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే 2019 చివర్లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-1తో సాధించింది. ఇక్కడ తొలి వన్డేలో భారత్‌ పరాజయం పాలైంది. భారత్‌ నిర్దేశించిన 288 పరుగుల టార్గెట్‌ను విండీస్‌ ఛేదించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత్‌ వరుసగా రెండు వన్డేలను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2020 ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా టీమిండియా 2-1తోనే కైవసం చేసుకుంది.