శ్రీలంకలో ఉన్న ఇండియన్ టీమ్ ప్లేయర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya ) కరోనా బారిన పడిన విషయం విదితమే. ఇప్పుడు పాండ్యాతో సన్నిహితంగా ఉన్న 8 మంది (Eight key Players) ఇండియన్ ప్లేయర్స్ శ్రీలంక సిరీస్ (India vs Sri Lanka) మొత్తానికీ దూరమయ్యారు. వీళ్లలో కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ఈ ప్లేయర్స్ అందరినీ ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. దీంతో మిగతా రెండు టీ20లకు వీళ్లు అందుబాటులో ఉండబోవడం లేదు. దీంతో తుది జట్టును ఎంపిక చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు కష్టంగా మారనుంది.
ఆ 8 మందిలో శిఖర్ ధావన్ కాకుండా హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, పృథ్వి షా, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, యజువేంద్ర చాహల్ ఉన్నారు. నిజానికి ఈ ప్లేయర్స్ అందరికీ నెగటివ్ అని తేలింది. అయినా వీళ్లను ఐసోలేషన్‌లో ఉంచాలని నిర్ణయించారు. మరోవైపు పాజిటివ్‌గా తేలిన కృనాల్ మరో హోటల్‌కు మారాడు. ఈ లిస్ట్‌లో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఉండటంతో వాళ్లను ఇంగ్లండ్‌లో ఉన్న టెస్ట్ టీమ్ దగ్గరికి పంపించాలన్న బీసీసీఐ ప్లాన్స్ కూడా దెబ్బతిన్నాయి. వాళ్లను ఎలాగోలా ఇంగ్లండ్ పంపిస్తున్నా.. అది ఆలస్యం కానుంది. కాగా ఇండియా, శ్రీలంక మధ్య రెండో టీ20 ఇవాళ జరగనున్న విషయం తెలిసిందే. మూడో, ఆఖరి టీ 20 గురువారం జరగాల్సి ఉంది.
శ్రీలంక యొక్క ఆరోగ్య భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం, జూలై 30 న కృనాల్ పాండ్యా ఇతర సభ్యులతో కలిసి భారతదేశానికి తిరిగి వెళ్ళలేరు, ఎందుకంటే అతను ఇప్పుడు తప్పనిసరిగా ఐసోలేషన్ లో ఉండవలసి ఉంటుంది. అలాగే నెగిటివ్ RT-PCR నివేదికను పొందవలసి ఉంటుంది. కృనాల్ పాండ్యా దగ్గు మరియు గొంతు నొప్పితో లక్షణాలతో బాధపడుతున్నాడు. ఏదేమైనా, భారత క్రికెట్ ప్లేయర్లందరూ వారి ప్రతికూల RT-PCR నివేదికను స్వీకరించే వరకు గదిలో ఒంటరిగా ఉంచబడ్డారని బిసిసిఐ వర్గాల నుండి తెలిసింది.