ఐపీఎల్ (IPL 2023)లో తమ తొలి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) ఓటములు మూటకట్టున్నాయి. ఆయా జట్లు కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ (Ben Stokes)ను రూ.16.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఆల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్ ఫిట్‌నెస్ సమస్యలతో బౌలింగ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.
వీడియో ఇదిగో, ఉమ్రాన్ 150 కి.మీ. స్పీడ్‌కి ఎగిరి అవతల పడిన వికెట్, బిత్తరపోయిన దేవదూత్ పడిక్కల్
ఇక ఇంగ్లండ్‌కు చెందిన మరో ఆటగాడు హ్యారీ బ్రూక్ (Harry Brook) కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా రూ. 13.25 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) కోసం ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా రూ.17 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ కూడా గ్రీన్ నిరాశపరిచాడు. బ్యాటింగ్‌కు దిగి 5 పరుగులు మాత్రమే చేసిన గ్రీన్.. రెండు ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చాడు.