MI vs CSK Highlights (PIC @ IPL Twitter)

చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఒకరి తర్వాతర ఒకరికి గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ కు తొడ కండరాల గాయమైంది. అతడికి స్కాన్‌లు తీయనున్నారు. శనివారం ముంబయితో మ్యాచ్‌లో చాహర్‌.. ఒకే ఒక్క ఓవర్‌ బౌలింగ్‌ చేసి మైదానాన్ని వీడాడు. మళ్లీ రాలేదు. స్కాన్‌లతో అతడి గాయం తీవ్రత తెలుస్తుంది. ప్రస్తుతానికి చాహర్‌ కొన్ని రోజులు ఐపీఎల్‌కు దూరమైనట్లే. ‘‘గాయం తీవ్రతను తెలుసుకునేందుకు చాహర్‌కు స్కాన్‌లు తీయనున్నారు’’ అని చెన్నై సూపర్‌కింగ్స్‌ తెలిపింది.

రూ.17.5 కోట్లు నీకెందుకు బ్రో, కామెరాన్ గ్రీన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు, దారుణంగా విఫలమవుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

ఇక చెన్నై స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా గాయంతో బాధపడుతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన అతడు.. ముంబయిపై బరిలోకి దిగలేదు. అతడి కాలి వేలికి గాయమైంది. స్టోక్స్‌కు ముందే మోకాలి సమస్య ఉంది. అందువల్ల పూర్తిగా స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒకే ఓవర్‌ వేశాడు. చెన్నై వేలంలో రూ.16.5 కోట్లకు స్టోక్స్‌ను కొనుక్కుంది.మరోవైపు సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ సైతం గాయంతో ముంబయి మ్యాచ్‌కు దూరమయ్యాడు.