రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారుతున్న అతడిని తప్పించాలంటూ RR అభిమానులు రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు సూచిస్తున్నారు. ఆట తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ ఉన్న రియాన్‌ను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రూ. 3.80 కోట్లు ఈ ఆటకు అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
రాజస్తాన్ రాయల్స్ తరఫున 2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్. చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 16 పరుగులు చేశాడు. అదే విధంగా 3 ఓవర్ల బౌలింగ్‌లో 24 పరుగులు ఇచ్చాడు. నాటి నుంచి నేటి దాకా ఆట కంటే కూడా మైదానంలో తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.
గత సీజన్‌లో కేవలం 183 పరుగులు చేసి ఒక్క వికెట్ మాత్రమే తీసిన రియాన్ పరాగ్.. ఐపీఎల్-2023లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 39 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ 7 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడి ఆట తీరు, మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు 51 మ్యాచ్‌లలో 41 ఇన్నింగ్స్ ఆడిన రియాన్ పరాగ్ చేసిన పరుగులు 561. సగటు 16.03. బౌలింగ్‌లోనూ పెద్దగా పొడిచిందేమీ లేదు! అయినా బంధుప్రీతి అంటే ఇదే కాబోలు. వరుసగా ఫెయిల్ అవుతున్నా అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయని విమర్శలు గుప్పిస్తున్నారు.మైదానంలో తన చేష్టలు చూస్తుంటే ఆటకు స్వస్తి చెప్పి త్వరలోనే చీర్ లీడర్స్‌తో పాటు చేరతాడేమో అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ ఆఖరి ఓవర్ వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.