MS Dhoni (Photo-Video Grab)

ఐపీఎల్‌-2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. చెన్నై విసిరిన 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌(62), మాక్స్‌వెల్‌(76) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్‌కే వైపే నిలిచింది.

కాగా ఈ మ్యాచ్‌లో మిస్టర్ కూల్ గా ప్రసిద్ధి చెందిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంస్‌ ధోని తన ప్రశాంతతను కోల్పోయాడు. ఫీల్డింగ్‌లో అలసత్వం వహించిన మొయిన్ అలీపై ఎంస్‌ కోపంతో ఊగిపోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 18 ఓ‍వర్‌ వేసిన పతిరానా బౌలింగ్‌లో చివరి బంతికి పార్నెల్‌ ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా షాట్‌ ఆడాడు.బంతికి ఎక్స్‌ట్రా కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మొయిన్‌ అలీ చేతికి వెళ్లింది. ఈ క్రమంలో పార్నెల్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. అయితే నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న ప్రభుదేశాయి మాత్రం పార్నెల్‌ను గమనించలేదు. పార్నెల్‌ గట్టిగా అరవడంతో ప్రభుదేశాయ్‌ వికెట్‌ కీపర్‌వైపు పరిగెత్తాడు.

అజింక్య రహానే వావ్ అనిపించే క్యాచ్ వీడియో ఇదిగో, బౌండరీ లైన్ వద్ద కళ్ళు చెదిరే ఫీల్డింగ్‌తో 5 పరుగులు సేవ్ చేసిన రహానే

అయితే మొయిన్‌ బంతిని సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా తన పక్కనే ఉన్న బంతిని వికెట్‌ కీపర్‌కు త్రో చేయకుండా బద్దకంగా వ్యవహరించాడు. ఒక వేళ బంతిని వెంటనే అందుకుని వికెట్‌ కీపర్‌కు అతడు త్రో చేసి ఉంటే సుయాష్‌ ప్రభుదేశాయి రనౌట్‌గా వెనుదిరిగేవాడు.

Here's VIdeo

బంతిని త్రో చేయడంలో మొయిన్‌ అలీ అలసత్వం వహించడంతో రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి సుయాష్‌ తప్పించుకున్నాడు. ఇక మొయిన్‌ అలీ పేలవ ఫీల్డింగ్‌పై ధోని ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ధోని కోపంతో మొయిన్ వైపు చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.