IPL 2023 యొక్క లీగ్ దశ చివరి రోజు చాలా నాటకీయతను చూసింది, ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి ఫైనల్ ప్లేఆఫ్ బెర్త్‌ను కైవసం చేసుకోగలిగింది. ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న గుజరాత్, చెన్నైలకు రెండు సార్లు క్వాలిఫయర్ ఆడే అవకాశం లభిస్తుంది.కాగా తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది.
ఐపీఎల్ రేసు నుంచి బెంగుళూరు ఔట్, స్టేడియంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవే..
ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో ముంబై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టికరిపించింది. ఇక గత మ్యాచ్‌లో సూపర్ విక్టరీతో ఆశలు రేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. చివరి మ్యాచ్‌లో ఓటమితో సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తుచేసింది.
ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ షెడ్యూల్
క్వాలిఫయర్-1: మే 23
గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
వేదిక: చెపాక్ స్టేడియం (చెన్నై)
ఎలిమినేటర్: మే 24
లక్నో సూపర్ జెయంట్స్ vs ముంబై ఇండియన్స్
వేదిక: చెపాక్ స్టేడియం (చెన్నై)
క్వాలిఫయర్-2: మే 26
ఎలిమినేటర్‌లో విజేత vs క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు
వేదిక: నరేంద్రమోదీ స్టేడియం (గుజరాత్)
ఫైనల్: మే 28
క్వాలిఫయర్-1 విజేత vs క్వాలిఫయర్-2 విజేత
వేదిక: నరేంద్రమోదీ స్టేడియం (గుజరాత్)
అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.