ఐపీఎల్ 16వ సీజన్‌లో రింకూ సింగ్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. మూడు సీజన్ల నుంచి అతను కేకేఆర్‌కు ఆడుతున్నప్పటికి ఏ సీజన్‌లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సీజన్‌లోమాత్రం దుమ్మురేపుతున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌ను గెలిపించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఆ తర్వాత కూడా అదే సత్తాను కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ డెత్ ఓవర్లలో కింగ్‌గా మారిపోయాడు.
నిన్న ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనూ స్లోపిచ్‌పై తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికి రింకూ సింగ్ 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులతో సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్‌తోనే కేకేఆర్ 170 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
తాజాగా రింకూ సింగ్ కొత్త రికార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో డెత్ ఓవర్లలో(17-20 ఓవర్ల మధ్య) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రింకూ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు డెత్ ఓవర్లలో 197.53 స్ట్రైక్‌రేట్‌తో 161 పరుగులు చేశాడు. రింకూ సింగ్ తర్వాత షిమ్రోన్ హెట్‌మైర్ 200 స్ట్రైక్‌రేట్‌తో 144 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. టిమ్ డేవిడ్ 213.11 స్ట్రైక్‌రేట్‌తో 130 పరుగులతో మూడో స్థానంలో.. ఇక ద్రువ్ జురేల్ 205 స్ట్రైక్‌రేట్‌తో 115 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.