చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో పరుగుల వరద పారింది. మొత్తంగా 444 పరుగులు.. ఇరుజట్ల నుంచి 24 ఫోర్లు, 33 సిక్సర్లు. ఇలా బౌండరీల హోరుతో దద్దరిల్లిన మ్యాచ్ లో చెన్నై జట్టు మురిసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), దుబే(27 బంతుల్లో 52) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. 13వ ఓవర్ దూబే బాదిన సిక్సర్ ఏకంగా 111 మీ. దూరం వెళ్లడం విశేషం. 227 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బెంగళూరు తొలి ఓవర్‌లోనే కోహ్లి వికెట్‌ను కోల్పోయింది.
అనంతరం డుప్లెసిస్, మాక్స్‌వెల్ షో మొదలైంది. వీరిద్దరూ సీఎస్‌కే బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించారు. మాక్స్‌వెల్ 36 బాల్స్‌లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో 76 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.
స్కోరుబోర్డు
చెన్నై: రుతురాజ్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 3, కాన్వే (బి) హర్షల్ 83, రహానె (బి) హసరంగ 37, శివమ్ దూబే (సి) సిరాజ్ (బి) పార్నెల్ 52, రాయుడు (సి) కార్తీక్ (బి) వైశాఖ్ 14, మొయిన్ అలీ (నాటౌట్) 19, జడేజా (సి/సబ్) ప్రభుదేశాయ్ (బి) మ్యాక్స్‌వెల్ 10, ధోనీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 226/6; వికెట్ల పతనం: 1-16, 2-90, 3-170, 4-178, 5-198, 6-224; బౌలింగ్: సిరాజ్ 4-0-30-1, పార్నెల్ 4-0-48-1, విజయ్‌కుమార్ వైశాఖ్ 4-0-62-1, మ్యాక్స్‌వెల్ 2.4-0-28-1, హసరంగ 2-0-21-1, హర్షల్ పటేల్ 3.2-0-36-1.
బెంగళూరు: కోహ్లీ (బి) ఆకాశ్ 6, డుప్లెసి (సి) ధోనీ (బి) అలీ 62, మహిపాల్ (సి) రుతురాజ్ (బి) దేశ్‌పాండే 0, మ్యాక్స్‌వెల్ (సి) ధోనీ (బి) తీక్షణ 76, షాబాజ్ (సి) రుతురాజ్ (బి) పథిరన 12, దినేశ్ (సి) తీక్షణ (బి) దేశ్‌పాండే 28, ప్రభుదేశాయ్ (సి) జడేజా (బి) పథిరన 19, పార్నెల్ (సి) దూబే (బి) దేశ్‌పాండే 2, హసరంగ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 218/8; వికెట్ల పతనం: 1-6, 2-15, 3-141, 4-159, 5-191, 6-192, 7-197, 8-218; బౌలింగ్: ఆకాశ్ 3-0-35-1, తుషార్ దేశ్‌పాండే 4-0-45-3, తీక్షణ 4-0-41-1, జడేజా 4-0-37-0, మతీశ పథిరన 4-0-42-2, మొయిన్ అలీ 1-0-13-1.