ఐపీఎల్ 2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. కింగ్ మరో ఆరు పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని తాకిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. 16 నెలల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్, నేను సజీవంగా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ భావోద్వేగం
2007లో టీ20 క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన కోహ్లి టీ20 ఫార్మాట్ మొత్తంలో కలిపి 376 మ్యాచ్‌లు ఆడి 41.21 సగటను, 133.42 స్ట్రయిక్‌రేట్‌తో 11994 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌లో కేవలం ఐదుగురు మాత్రమే టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని తాకారు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ (14562) టాప్‌లో ఉండగా.. పాక్ షోయబ్ మాలిక్ (13360), విండీస్ పోలార్డ్ (12900), ఇంగ్లండ్ అలెక్స్ హేల్స్ (12319), ఆసీస్ డేవిడ్ వార్నర్ (12065) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు.
తుది జట్లు (అంచనా):
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్