ఐపీఎల్ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) స్థానంలో భారత మాజీ ఆటగాడు హేమంద్ బదొనికి హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించిన ఢిల్లీ యాజమాన్యం తాజాగా భారత జట్టు వన్డే వరల్డ్ కప్ హీరో అయిన మునాఫ్ పటేల్ (Munaf Patel)ను కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
ఆస్ట్రేలియకు చెందిన జేమ్స్ హోప్స్ స్థానంలో మునాఫ్ ఢిల్లీ బౌలింగ్ కోచ్ గా జాయిన్ అవుతారని ఢిల్లీ ఫ్రాంచైజీ వెల్లడించింది.ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల రావు, హెడ్‌కోచ్ హేమంగ్ బదొనిలతో కలిసి మునాఫ్ 18వ సీజన్‌లో ఢిల్లీ జట్టు గెలుపు వ్యూహాలు రచించనున్నాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడిన మునాఫ్.. 63 మ్యాచుల్లో 75 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా 2011లో వరల్డ్ కప్ పవర్ ప్లేలో కీలక వికెట్లు తీసిన మునాఫ్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్ కప్ చాంపియన్ కావడంలో భాగమయ్యాడు. 6 నుంచి 2011 మధ్య దేశానికి ప్రతినిధ్యం వహించిన మునాఫ్ 13 టెస్టులు, 70 వన్డేలు, 3 టీ20 లు ఆడారు. సారి ఢిల్లీ రూ.73 కోట్లతో మెగా వేలంలో పాల్గొననుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా వేలం జరుగనుంది.