IPL 2023: 60 రోజులు.. 10 జట్లు.. 12 వేదికలు..74 మ్యాచ్‌లు, నేటి నుంచి ఐపీఎల్ పండగ, తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్‌కింగ్స్‌
IPL-captains-with-the-trophy (Photo-IPL)

IPL Opening Ceremony 2023, Performers, Date, Time, Venue, Schedule: ఐపీఎల్‌ 2023 కొత్త సీజన్‌కు గంట మోగింది. నేటి నుంచి మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు ఇలా సాగనుంది. అన్నింటికి మించి 2019 తర్వాత అన్ని జట్లకూ సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది. తొలి పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది

యువతితో అసభ్యకరంగా క్రికెట్ కోచ్ నరేందర్ షా, పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు, ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

కరోనా కారణంగా గత మూడు సీజన్ల పాటు వేదికల విషయంలో షరతుల కారణంగా అందరికీ తమ సొంత మైదానాల్లో ఆడే అవకాశం రాలేదు.ఇప్పుడు భారీ స్థాయిలో, స్థానిక అభిమానుల మద్దతుతో పది జట్లూ హంగామాకు సిద్ధమయ్యాయి. మారిన ఆటగాళ్లు, నిబంధనల్లో స్వల్ప మార్పులతో పదహారో సీజన్‌ లీగ్‌ కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతీయ జట్లకు ఆడుతున్న కారణంగా దక్షిణాఫ్రికా, శ్రీలంకలకు చెందిన ఆటగాళ్లు కాస్త ఆలస్యంగా తమ ఐపీఎల్‌ టీమ్‌లతో చేరతారు. గురువారం అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్‌ల ఫొటో సెషన్‌ నిర్వహించారు. అస్వస్థత కారణంగా ఈ కార్యక్రమానికి ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాజరుకాలేదు.

Here's Shedule

IPL Time Table

ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ పేరుతో కొత్త నిబంధనను లీగ్‌ కౌన్సిల్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం తాము ముందుగా ప్రకటించిన నలుగురు సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లలో ఒకరిని మ్యాచ్‌ మధ్యలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలోకి దిగవచ్చు. అంటే బ్యాటింగ్‌ ఒకరు చేసిన తర్వాత అతని స్థానంలో తర్వాతి ఇన్నింగ్స్‌లో మరో బౌలర్‌ను తీసుకునే అవకాశం జట్టుకు ఉంది. టాస్‌ తర్వాత తుది జట్టును ప్రకటించడం కూడా తొలిసారి అమలు చేస్తున్నారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా నితీశ్‌ రాణా, సంచలన నిర్ణయం తీసుకున్న కెకెఆర్, గాయంతో టోర్నీకి దూరమైన కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌

ఫార్మాట్‌ ఇలా...

లీగ్‌ దశలో ప్రతీ టీమ్‌ 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే పది జట్లు ఉండటంతో గత ఏడాదిలాగే కాస్త భిన్నమైన ఫార్మాట్‌ను అమలు చేస్తున్నారు. 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్‌లో తమ గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ చొప్పున... మరో గ్రూప్‌లోనే ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. గతేడాది డిసెంబరులో జరిగిన వేలం ద్వారా పది జట్లు కొత్త రూపును సంతరించుకున్నాయి. చెన్నైకి ఆడిన సామ్‌ కర్రాన్‌ను ఏకంగా రూ.18.50 కోట్లకు పంజాబ్‌ తీసుకోగా.. స్టోక్స్‌ రూ.16.25 కోట్లకు చెన్నైకి వచ్చాడు. ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఉన్న విలియమ్సన్‌ గుజరాత్‌ బ్యాటర్‌గా మారాడు.

పూర్తి వివరాలు..

గ్రూప్‌ ఎ: ముంబై, కోల్‌కతా, రాజస్థాన్‌, ఢిల్లీ, లక్నో

గ్రూప్‌ బి: చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, పంజాబ్‌, గుజరాత్‌

ప్రైజ్‌మనీ: విజేతకు : రూ. 20 కోట్లు

రన్నర్‌పనకు: రూ. 13 కోట్లు

ప్లే ఆఫ్‌ జట్లకు (2): చెరి రూ. 7 కోట్లు

రాత్రి 7.30నుంచి స్టార్‌స్పోర్ట్స్‌, జియో సినిమాలో...