
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు, హర్యానా హరికేన్ కపిల్‌దేవ్‌కు గుండెపోటు (Kapil Dev Suffers Heart Attack) వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు గుండె ఆపరేషన్ చేశారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. తాజా వార్తల నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు. హర్యానా హరికేన్‌గా పేరొందిన కపిల్ సారథ్యంలోనే భారత జట్టు 1983లో (World Cup 1983) వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది.
ఆయన ఆరోగ్యంపై వార్తలు రాగానే ఒక్కసారిగా ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కపిల్ ఆరోగ్యంపై పలువురు సీనియర్ క్రికెటర్లు స్పందిస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిలషించారు.
ఇదిలా ఉంటే .. 1983 చరిత్రాత్మక వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు కపిల్ కెప్టెన్. ఆ సిరీస్‌లో తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కపిల్ ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 131 టెస్టులు, 225 వన్డేలు ఆడిన కపిల్... 9000కు పైగా పరుగులు చేశారు. అంతేగాక టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా కూడా రికార్డు సాధించారు.