
ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత జాతీయ క్రికెట్ జట్టు, పాకిస్తాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ 2025 టైటిల్ ను ముద్దాడింది. ఇది టీమ్ ఇండియాకు ఆసియా కప్‌లో తొమ్మిదవ టైటిల్.ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ అజేయంగా హాఫ్ సెంచరీ సాధించాడు. 53 బంతుల్లో 69 రన్‌లు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగా టీమ్ ఇండియా 19.4 ఓవర్లలో 147 రన్‌ల లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ప్రదర్శనతో తిలక్ వర్మ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు.
తిలక్ వర్మకు క్రికెట్ లో మొదటి కోచ్ సలాం బయాష్ అని చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ క్రికెటర్ కు అయినా జీవితంలో మొదటి కోచ్ అంటే చాలా ముఖ్యుడు. వాళ్లే ఆటగాడి ప్రతిభను గుర్తించి, సరైన దిశలో నడిపిస్తారు. హైదరాబాద్‌కు చెందిన సలాం బయాష్ చిన్న వయసులో తిలక్ వర్మను గుర్తించి, అతన్ని లీగాలా క్రికెట్ అకాడమీలో తీసుకున్నారు. వర్మ 11 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు, సలాం ఆయన ప్రతిభను గమనించారు.
తిలక్ చిన్నప్పుడు ప్రతిరోజూ ప్రాక్టీస్‌కు వెళ్ళేవాడు. సలాం 40 కి.మీ దూరాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్ళి, ప్రాక్టీస్ మిస్ కాకుండా చూసేవారు. U-14 జట్టులో తిలక్ తిరస్కరించబడినప్పుడు కూడా, సలాం ఆయనను వదలకుండా మరింత శిక్షణ ఇచ్చి కలలు నిజం చేయడం కోసం ప్రోత్సహించారు. అందువల్ల, తిలక్ వర్మ 2018లో హైదరాబాద్ జట్టు కోసం తన మొదటి మ్యాచ్ ఆడారు. 2019లో లిస్ట్-ఎ తరపున అరంగేట్రం చేశాడు, 2022లో ఐపీఎల్ ముంబై ఇండియన్స్ ఎంపికయ్యాడు. 2023లోవెస్టిండీస్‌తో T20I తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. వన్డే ఎంట్రీ బంగ్లాదేశ్‌తో జరిగింది.
Meet Tilak Varma’s Childhood Coach Salam Bayash
View this post on Instagram
సలాం బయాష్ కృషి, పట్టుదల, యువ ప్రతిభను గుర్తించడంలో స్ఫూర్తిదాయక కోచ్‌గా నిలిచారు. తిలక్ వర్మ, అతని కుటుంబంతో ఆయన సన్నిహిత సంబంధం కలిగి, యువ ఆటగాళ్లకు క్రికెట్ లో మంచి మార్గం చూపుతున్నారు. సలాం బయాష్ ఇంకా లీగాలా క్రికెట్ అకాడమీ ద్వారా యువకుల ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తున్నారు. తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడం చూసి ఎంతో సంతోషపడుతున్నారు. ఆయన నల్గొండ లయన్స్‌కు మాజీ ఫీల్డింగ్ కోచ్ కూడా.