MI vs KXIP Stat Highlights: రెండు సూపర్ ఓవర్లతో సండే బ్లాక్ బాస్టర్ మ్యాచ్, ముంబైపై విజయం సాధించిన పంజాబ్, కింగ్స్ లెవన్‌ను గెలిపించిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్
KL Rahul (Photo Credits: Twitter|@lionsdenkxip)

సూపర్‌ ఓవర్‌ మీద సూపర్‌ ఓవర్‌ జరిగిన సండే మ్యాచ్‌లో (MI vs KXIP Stat Highlights IPL 2020)చివరకు పంజాబ్‌దే పైచేయి అయింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమాన స్కోర్లు చేయగా.. ఫలితం తేలేందుకు నిర్వహించిన సూపర్‌ ఓవర్‌ కూడా ‘టై’ అయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ బుమ్రా ధాటికి కేవలం 5 పరుగులే చేయగలిగితే.. ఆ తర్వాత షమీ ధాటికి ముంబై కూడా సరిగ్గా అన్నే పరుగులు చేసింది. ఫలితాన్ని నిర్ణయించడానికి మరోసారి సూపర్‌ ఓవర్‌ ఆడించాల్సి వచ్చింది.

కోల్‌కతా, హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ కూడా సూపర్‌ ఓవర్‌కు వెళ్లినా.. ఏకపక్షంగా ముగిసింది. మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. ఈ సారి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై.. పొలార్డ్‌ ధాటిగా ఆడటంతో 11 పరుగులు చేసింది. ఈ సారి పంజాబ్‌ యూనివర్సల్‌ బాస్‌ గేల్‌, మయాంక్‌ను బరిలో దించగా.. వీరిద్దరూ విజృంభించి నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను (Kings XI Punjab Beat Mumbai Indians) ముగించారు.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. వరుస విజయాలతో ఉన్న ముంబై టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌ ఎంచుకున్నా.. పంజాబ్‌ బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. కానీ డెత్‌ ఓవర్లలో పొలార్డ్‌ బాదుడుకు పట్టు కోల్పోయారు. ఇక ఎప్పటిలాగే డికాక్‌ హ్యాట్రిక్‌ అర్ధసెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వరుస విరామాల్లో రోహిత్‌ (9), సూర్యకుమార్‌ (0), ఇషాన్‌ (7) వికెట్లను కోల్పోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై (Mumbai Indians) 43/3తో కష్టాల్లో పడింది.

రాజస్థాన్‌ బౌలర్లను ఊచకోత కోసిన ఏబీ డివిలియర్స్‌, 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని బెంగుళూరు ఘన విజయం, ఆరో ఓటమితో సంక్లిష్టంగా మారిన రాయల్స్‌ ఆశలు

ఈ దశలో పంజాబ్‌ (Kings XI Punjab) దూకుడును అడ్డుకున్న డికాక్‌కు క్రునాల్‌ (34) సహకరించాడు. చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ వీరు నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. 14వ ఓవర్‌లో క్రునాల్‌ను స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అవుట్‌ చేయగా నాలుగో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు హార్దిక్‌ (8) తొలి బంతినే సిక్సర్‌గా మలిచినా నాలుగు బంతులకే పరిమితమయ్యాడు. 15వ ఓవర్‌లో డికాక్‌ వరుసగా 4,6 బాదగా 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ కాసేపటికే పేసర్‌ జోర్డాన్‌ అతడి జోరుకు ముగింపు పలికాడు. బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాహుల్‌ నిలిచాడు.

లక్ష్య ఛేదనలో పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ మూడో ఓవర్‌లోనే 4,4,6,4తో విరుచుకుపడగా 20 పరుగులు వచ్చాయి. అయితే నాలుగో ఓవర్‌లో మయాంక్‌ (11)ను బుమ్రా అవుట్‌ చేసి ఝలక్‌ ఇచ్చాడు. అటు గేల్‌ (24) నిరాశపర్చినా పూరన్‌ (24) మాత్రం ఉన్నంత సేపు ధనాధన్‌ ఆటను ప్రదర్శించాడు. తనని కూడా బుమ్రానే పెవిలియన్‌కు చేర్చగా.. మ్యాక్స్‌వెల్‌ డకౌట్‌ అయ్యాడు. అటు వికెట్లు పడుతున్నా రాహుల్‌ మాత్రం కసిగా ఆడుతూ ఓ సిక్సర్‌తో 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే 15 బంతుల్లో 24 పరుగులు కావాల్సిన దశలో బుమ్రా యార్కర్‌కు రాహుల్‌ బౌల్డ్‌ కావడంతో పంజాబ్‌కు షాక్‌ తగిలింది.

రాహుల్‌ నిష్క్రమణ తర్వాత అంతా అయుపోయినట్టే అనిపించినా దీపక్‌ హూడా, జోర్డాన్‌ మాత్రం పోరాటం ఆపలేదు. వీరి జోరుతో పంజాబ్‌ లక్ష్యం ఆఖరి ఓవర్‌లో 9 రన్స్‌కు తగ్గింది. తొలి బంతికే మరోసారి హూడాకు లైఫ్‌ లభించగా జోర్డాన్‌ ఓ ఫోర్‌తో మ్యాచ్‌పై ఆశలు రేపాడు. అయితే ఆఖరి బంతికి జోర్డాన్‌ రనౌట్‌ అవడంతో మ్యాచ్‌ టై అయ్యింది.

స్కోరు బోర్డు

ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (బి) అర్ష్‌దీప్‌ సింగ్‌ 9; డికాక్‌ (సి) మయాంక్‌ (బి) జోర్డాన్‌ 53; సూర్యకుమార్‌ (సి) ఎం.అశ్విన్‌ (బి) షమి 0; ఇషాన్‌ (సి) ఎం.అశ్విన్‌ (బి) అర్ష్‌దీప్‌ సింగ్‌ 7; క్రునాల్‌ (సి) హూడా (బి) బిష్ణోయ్‌ 34; హార్దిక్‌ (సి) పూరన్‌ (బి) షమి 8; పొలార్డ్‌ (నాటౌట్‌) 34; కల్టర్‌నైల్‌ (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 176/6; వికెట్ల పతనం: 1-23, 2-24, 3-38, 4-96, 5-116, 6-119; బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4-0-24-0; షమి 4-0-30-2; అర్ష్‌దీప్‌ సింగ్‌ 3-0-35-2; జోర్డాన్‌ 3-0-32-1; ఎం.అశ్విన్‌ 3-0-28-0; హుడా 1-0-9-0; రవి బిష్ణోయ్‌ 2-0-12-1.

కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (బి) బుమ్రా 77; మయాంక్‌ (బి) బుమ్రా 11; క్రిస్‌ గేల్‌ (సి) బౌల్ట్‌ (బి) చాహర్‌ 24; పూరన్‌ (సి) కల్టర్‌నైల్‌ (బి) బుమ్రా 24; మ్యాక్స్‌వెల్‌ (సి) శర్మ (బి) చాహర్‌ 0; దీపక్‌ హుడా (నాటౌట్‌) 23; జోర్డాన్‌ (రనౌట్‌/పొలార్డ్‌/డికాక్‌) 13; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 176/6; వికెట్ల పతనం: 1-33, 2-75, 3-108, 4-115, 5-153, 6-176; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-48-0; క్రునాల్‌ 2-0-12-0; బుమ్రా 4-0-24-3; కల్టర్‌నైల్‌ 4-0-33-0; పొలార్డ్‌ 2-0-26-0; రాహుల్‌ చాహర్‌ 4-0-33-2.