MI vs SRH IPL 2021: ముంబై బౌలర్ల మెరుపులు..గెలుపు ముంగిట బోల్తా పడిన హైదరాబాద్, 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ విక్టరీ, పొలార్డ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌
Mumbai Indians (Photo Credits: Twitter/@IPL)

గెలిచే మ్యాచ్‌ను హైదరాబాద్‌ చేజేతులా ముంబైకి అప్పజెప్పింది. ముంబై ఇండియన్స్‌ బౌలర్లు మరోసారి అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో (MI vs SRH IPL 2021 Stat Highlights) ముంబై ఇండియన్స్‌ 13 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై (Mumbai Indians Beat Sunrisers Hyderabad by 13 Runs) గెలిచింది. కోల్‌కతాపై 152 పరుగులను కాపాడుకున్నట్టుగానే.. ఈసారి సన్‌రైజర్స్‌ను 151 పరుగులను కూడా చేయనీయకుండా ముంబై బౌలర్లు (Kieron Pollard, Bowlers Shine) దెబ్బతీశారు. ఓపెనర్లు బెయిర్‌స్టో (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43), వార్నర్‌ (34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) శుభారంభం అందించినా మిగతా రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు.

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. డికాక్‌ (39 బంతుల్లో 5 ఫోర్లతో 40), పొలార్డ్‌ (22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 35 నాటౌట్‌), రోహిత్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించారు. ముజీబుర్‌, విజయ్‌ శంకర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పొలార్డ్‌కు లభించింది.

టాస్‌ గెలిచిన ముంబై బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీనికి తగినట్టుగానే ఓపెనర్లు రోహిత్‌ (32), డికాక్‌ తొలి వికెట్‌కు 38 బంతుల్లోనే 55 పరుగులు జోడించారు. కానీ ఈ దూకుడు ఆ తర్వాత కనిపించలేదు. చివర్లో పొలార్డ్‌ జోరుతో జట్టు కోలుకుంది. ఆరంభ ఓవర్‌లోనే డికాక్‌ రెండు ఫోర్లతో జోరు చూపించాడు. ఆ తర్వాత రోహిత్‌ బ్యాట్‌ ఝుళిపిస్తూ 6,4తో కదం తొక్కాడు. దీంతో పవర్‌ ప్లేలో జట్టు పరుగులు సాధించింది. అయితే విజయ్‌ శంకర్‌ తన వరుస ఓవర్లలో రోహిత్‌, సూర్యకుమార్‌ (10) వికెట్లతో ముంబైకి షాక్‌ ఇచ్చాడు. దీనికి తోడు క్రీజులో కుదురుకున్న డికాక్‌ 14వ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఇషాన్‌ (12), హార్దిక్‌ (7) విఫలమయ్యారు. అయితే భువీ వేసిన చివరి రెండు ఓవర్లలో ముంబై 28 పరుగులు రాబట్టింది. ఆఖరి ఓవర్‌లో పొలార్డ్‌ రెండు సిక్సర్లతో ముంబై 150 పరుగులకు చేరింది.

హైదరాబాద్‌లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్, మొత్తం 9 నగరాల్లో వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ, న‌రేంద్ర మోదీ స్టేడియంలో వర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌, పాక్ ఆటగాళ్లకు వీసా లైన్ క్లియర్

స్వల్ప ఛేదనను ప్రారంభించిన సన్‌రైజర్స్‌ పవర్‌ప్లేలోనే 57 పరుగులతో ఊపు మీద కనిపించింది. కానీ ఎప్పటిలాగే మిడిలార్డర్‌ ఆ ఆశలను వమ్ము చేసింది. మూడో ఓవర్‌లో బెయిర్‌స్టో వరుసగా 4,4,6,4తో బౌల్ట్‌ను బేజారెత్తిస్తూ 18 పరుగులు.. ఆ తర్వాత మిల్నే ఓవర్‌లో రెం డు సిక్సర్లు బాది 19 రన్స్‌ రాబట్టాడు. అయితే దాదాపు పది పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళుతున్న బెయిర్‌స్టో-వార్నర్‌ జోడీకి ఎనిమిదో ఓవర్‌లో బ్రేక్‌ పడింది. క్రునా ల్‌ వేసిన ఈ ఓవర్‌లో బెయిర్‌స్టో హిట్‌ వికెట్‌ అయ్యా డు. దీంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రైజర్స్‌ పతనం ఆరంభమైంది. మనీశ్‌ పాండే (2), వార్నర్‌, విరాట్‌ సింగ్‌ (11), అభిషేక్‌ వర్మ (2) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు.

అయితే విజయ్‌ శంకర్‌ (28) మాత్రం 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. అటు 18వ ఓవర్‌లో అబ్దుల్‌ సమద్‌ (7) రనౌట్‌, రషీద్‌ ఖాన్‌ (0) ఎల్బీతో ఉత్కంఠ పెరిగింది. అప్పటికి 12 బంతుల్లో రైజర్స్‌ 21 పరుగులు చేయాల్సి ఉండగా 19వ ఓవర్‌లో విజయ్‌ శంకర్‌ను బుమ్రా దెబ్బతీశాడు. సమీకరణం ఆరు బంతుల్లో 16 రన్స్‌కు చేరింది. అయితే సూపర్‌ యార్కర్లతో భువనేశ్వర్‌ (1), ఖలీల్‌ (1)ను బౌల్ట్‌ బౌల్డ్‌ చేయడంతో రైజర్స్‌ ఖేల్‌ ముగిసింది.

స్కోరుబోర్డు

ముంబై: డికాక్‌ (సి) సబ్‌-సుచిత్‌ (బి) ముజీబుర్‌ 40; రోహిత్‌ (సి) విరాట్‌ సింగ్‌ (బి) విజయ్‌ శంకర్‌ 32; సూర్యకుమార్‌ (సి అండ్‌ బి) విజయ్‌ శంకర్‌ 10; ఇషాన్‌ (సి) బెయిర్‌స్టో (బి) ముజీబుర్‌ 12; పొలార్డ్‌ (నాటౌట్‌) 35; హార్దిక్‌ (సి) విరాట్‌ సింగ్‌ (బి) ఖలీల్‌ 7; క్రునాల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 150/5; వికెట్ల పతనం: 1-55, 2-71, 3-98, 4-114, 5-131; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-45-0; ఖలీల్‌ అహ్మద్‌ 4-0-24-1; ముజీబుర్‌ 4-0-29-2; అభిషేక్‌ 1-0-5-0; విజయ్‌ శంకర్‌ 3-0-19-2; రషీద్‌ 4-0-22-0.

హైదరాబాద్‌: వార్నర్‌ (రనౌట్‌) 36; బెయిర్‌స్టో (హిట్‌ వికెట్‌) క్రునాల్‌ 43; మనీష్‌ పాండే (సి) పొలార్డ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 2; విరాట్‌ సింగ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 11; విజయ్‌ శంకర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 28; అభిషేక్‌ (సి) మిల్నే (బి) రాహుల్‌ చాహర్‌ 2; అబ్దుల్‌ సమద్‌ (రనౌట్‌) 7; రషీద్‌ (ఎల్బీ) బౌల్ట్‌ 0; భువనేశ్వర్‌ (బి) బౌల్ట్‌ 1; ముజీబుర్‌ (నాటౌట్‌) 1; ఖలీల్‌ (బి) బౌల్ట్‌ 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.4 ఓవర్లలో 137 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-67, 2-71, 3-90, 4-102, 5-104, 6-129, 7-130, 8-134, 9-135, 10-137; బౌలింగ్‌: బౌల్ట్‌ 3.4-0-28-3; బుమ్రా 4-0-14-1; మిల్నే 3-0-33-0; క్రునాల్‌ 3-0-30-1; రాహుల్‌ చాహర్‌ 4-0-19-3; పొలార్డ్‌ 2-0-10-0.

ఐపీఎల్‌లో నేడు

రాయల్‌ చాలెంజర్స్‌ X బెంగళూరు కోల్‌కతా

నైట్‌రైడర్స్‌ X ఢిల్లీ క్యాపిటల్స్‌ పంజాబ్‌ కింగ్స్‌

వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం