Sports, July 20:  కొంతకాలంగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా - భారత క్రికెట్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షమీ.. ఆ వార్త‌ల‌ను కొట్టిపారేశారు. త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వెనుకాడబోనని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు ప్రచారం చేయడం సరికాదని, దీని వల్ల ఎంటర్‌టైన్మెంట్ తప్ప ఉపయోగం ఉండదని తేల్చిచెప్పారు. అయితే కొన్ని సార్లు ఈ ఫేక్ ప్రచారం వల్ల తప్పులు జరిగే అవకాశం ఉందని అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు షమీ.

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారు వెరిఫైడ్ పేజీ నుంచి ఇలాంటి కామెంట్ చేస్తే, అప్పుడు దానికి స‌రైన రిప్లై వ‌స్తుంద‌ని చురకలు అంటించాడు. జీవితంలో ఏదైనా సాధించ‌డానికి ప్ర‌య‌త్నించండి కానీ ఇలా తప్పుడు ప్రచారం కోసం సమయం వృధా చేసుకోవద్దన్నారు. పాక్ క్రికెట‌ర్ షోయెబ్ మాలిక్‌ను పెళ్లాడిన సానియా మీర్జా ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటుండగా షమీ సైతం తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళల క్రికెట జట్టు, ఆసియా కప్‌ టోర్నీలో తొలిసారి ఘన విజయం, వీడియో ఇదిగో..

Here's Tweet: