తొలి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి జయహో అనిపించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్లతో షమీ చెలరేగాడు.టీమిండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ వరల్డ్‌కప్‌లో షమీ ఐదుకు పైగా వికెట్లు సాధించడం ఇది మూడో సారి.అంతకుముందు న్యూజిలాండ్, శ్రీలంకపై ఫైవ్ వికెట్ల హాల్ షమీ సాధించాడు.
ఇక మ్యాచ్‌లో ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో దుమ్ములేపిన షమీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తం 23 వికెట్లతో ఈసారి టోర్నీలో..టాప్ బౌలర్ స్థానానికి దూసుకొచ్చాడు. ఈ తరహా ప్రదర్శనను షమి ఫైనల్లోనూ పునరావృతం చేస్తే భారత్ మూడోసారి కప్ అందుకోవడం ఖాయం.
వన్డే వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు.
వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక ఫైవ్ వికెట్ల హాల్స్ నమోదు చేసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2019 వరల్డ్‌కప్‌లో కూడా షమీ ఒక ఫైవ్ వికెట్ల హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన షమీ.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. 2014లో బిన్నీ బంగ్లాదేశ్‌పై 4 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బిన్నీ ఆల్‌టైమ్ రికార్డును షమీ బ్రేక్ చేశాడు.