బౌలర్ల సమష్ఠి ప్రదర్శనకు తోడు కెప్టెన్ మోర్గాన్ (40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్) చాలా రోజుల తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. దీంతో సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (PBKS vs KKR, IPL 2021 Stat Highlights) కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... చివర్లో క్రిస్ జోర్డాన్ (18 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
ప్రసిధ్ కృష్ణ (3/ 30), సునీల్ నరైన్ (2/22), కమిన్స్ (2/31) ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కళ్లెం వేశారు. అనంతరం ఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలుపొందింది. మోర్గాన్ (40 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు , 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (32 బంతుల్లో 41; 7 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టును భారీ స్కోరు సాధించకుండా కోల్‌కతా బౌలర్లు కట్టడి చేశారు. వరుసగా మూడు ఓవర్లలో పంజాబ్ రాహుల్ (20 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్‌గేల్ (0), దీపక్ హుడా (1) వికెట్లను కోల్పోయింది. ఎక్కడో 5.3వ ఓవర్‌లో సిక్సర్ సాధించిన పంజాబ్‌కు మళ్లీ బౌండరీ సాధించడానికి ఏకంగా 26 బంతులు అవసరమయ్యాయి. తన రెండు వరుస ఓవర్లలో మయాంక్, హెన్రిక్స్ (2)లను సునీల్ నరైన్ అవుట్ చేయగా, పూరన్ (19; 1 ఫోర్, 1 సిక్స్)ను వరుణ్ చక్రవర్తి క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఛేదనలో కోల్‌కతా 3 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేసి ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోయేలా కనిపించింది. అయితే త్రిపాఠి, కెప్టెన్ మోర్గాన్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకోవడంతో కోల్‌కతా లక్ష్యం దిశగా కదిలింది. చివర్లో త్రిపాఠి, రస్సెల్ (10) అవుటై నా... దినేశ్ కార్తీక్ (12; 2 ఫోర్లు) సాయంతో మోర్గాన్ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.
స్కోరు వివరాలు, పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) నరైన్ (బి) కమిన్స్ 19; మయాంక్ (సి) త్రిపాఠి (బి) నరైన్ 31; గేల్ (సి) కార్తీక్ (బి) మావి 0; హుడా (సి) మోర్గాన్ (బి) ప్రసిధ్ 1; పూరన్ (బి) వరుణ్ 19; హెన్రిక్స్ (బి) నరైన్ 2; షారుఖ్ (సి) మోర్గాన్ (బి) ప్రసిధ్ 13; జోర్డాన్ (బి) ప్రసిధ్ 30; బిష్ణోయ్ (సి) మోర్గాన్ (బి) కమిన్స్ 1; షమీ (నాటౌట్) 1; అర్‡్షదీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–36, 2–38, 3–42, 4–60, 5–75, 6–79, 7–95, 8–98, 9–121.
బౌలింగ్: మావి 4–0–13–1, కమిన్స్ 3–0–31 –2, నరైన్ 4–0–22–0, ప్రసిధ్ 4–0–30–3, రసెల్ 1–0–2–0, వరుణ్ 4–0–24–1.
కోల్‌కతా ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) షమీ 9; రాణా (సి) పూరన్ (బి) హెన్రిక్స్ 0; త్రిపాఠి (సి) షారుఖ్ (బి) హుడా 41; నరైన్ (సి) బిష్ణోయ్ (బి) అర్‡్షదీప్ 0; మోర్గాన్ (నాటౌట్) 47; రసెల్ (రనౌట్) 10; కార్తీక్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16.4 ఓవర్లలో 5 వికెట్లకు) 126.
వికెట్ల పతనం: 1–5, 2–9, 3–17, 4–83, 5–98.
బౌలింగ్: హెన్రిక్స్ 1–0–5–1, షమీ 4–0–25– 1, అర్‡్షదీప్ 2.4–0–27–1, బిష్ణోయ్ 4–0–19– 0, జోర్డాన్ 3–0–24–0, హుడా 2–0–20–1.