PBKS vs SRH: దడ పుట్టిస్తున్న సన్‌రైజర్స్‌, వరుసగా నాలుగో విక్టరీ నమోదు చేసి టాప్‌-4లోకి, పంజాబ్‌ కింగ్స్‌ను ఏడు వికెట్లతో చిత్తుచేసిన హైదరాబాద్
Umran Malik (Photo credit: Twitter)

సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ 15వ సీజన్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది. పాయింట్ల పట్టికలో టాప్‌-4లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఏడు వికెట్లతో చిత్తుచేసింది. సన్‌రైజర్స్‌ యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ (4-1-28-4) ఆఖరి ఓవర్‌లో సూపర్‌ స్పెల్‌తో విజృంభించడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. లివింగ్‌స్టోన్‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60) అర్ధ సెంచరీతో అదరగొట్టగా, షారుక్‌ ఖాన్‌ (28 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లతో 26) ఫర్వాలేదనిపించాడు. భువనేశ్వర్‌ 3 వికెట్లు తీశాడు.

ఆ తర్వాత సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో 152/3 స్కోరుతో లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. మార్‌క్రమ్‌ (27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41 నాటౌట్‌), పూరన్‌ (30 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌తో 35 నాటౌట్‌) అజేయ ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (31), రాహుల్‌ త్రిపాఠి (34) రాణించారు. ఉమ్రాన్‌ మాలిక్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు, రబడ ఓ వికెట్‌ తీశారు.