RCB bowlers celebrate a wicket (Photo credit: Twitter)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పాయింట్ల ఖాతా తెరిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన స్వల్ప స్కోరింగ్‌ మ్యాచ్‌లో (RCB vs KKR Stat Highlights, IPL 2022) బెంగళూరు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది ఆర్‌సీబీకి తొలి విజయం కాగా ఆరంభ మ్యాచ్‌లో చెన్నైని ఓడించిన కేకేఆర్‌కు మొదటి ఓటమి. కోల్‌కతా నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. టిమ్‌సౌథీ(3/20), ఉమేశ్‌ యాదవ్‌(2/16) ధాటికి 17 పరుగులకే మూడు కీలక వికెట్లు డుప్లెసిస్‌(5), అనూజ్‌ రావత్‌(0), కోహ్లీ(12) కోల్పోయింది. ఈ దశలో రూథర్‌ఫోర్డ్‌(28), షాబాజ్‌ అహ్మద్‌(27), డేవిడ్‌ విల్లే(18) బ్యాటు ఝులిపించారు.

కోల్‌కతా బౌలింగ్‌ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. ముఖ్యంగా రూథర్‌ఫోర్డ్‌, విల్లే మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లక్ష్యం సమీపిస్తున్న సమయంలో వికెట్లు చేజార్చుకున్న బెంగళూరును దినేశ్‌ కార్తీక్‌(14 నాటౌట్‌), హర్షల్‌ పటేల్‌(10 నాటౌట్‌) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఆఖరి ఓవర్లో విజయానికి ఏడు పరుగులు అవసరమైన సమయంలో రస్సెల్‌ను లక్ష్యంగా చేసుకున్న కార్తీక్‌ వరుసగా బంతుల్లో సిక్స్‌, ఫోర్‌తో జట్టును గెలుపు సంబురాల్లో ముంచాడు.

విరాట్ కోహ్లీనే మళ్లీ నంబర్ వన్, వరుసగా ఐదో ఏడాదీ భారత్‌ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీగా రికార్డు, రూ. 1404 కోట్ల బ్రాండ్‌ వాల్యూతో అగ్రస్థానం

నరైన్‌(1/12), వరుణ్‌ చక్రవర్తి(1/33) ఒక్కో వికెట్‌ తీశారు. అంతకుముందు హసరంగ డిసిల్వా(4/20) ధాటికి కోల్‌కతా 18.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. నాలుగు వికెట్లతో కోల్‌కతాను కట్టడి చేయడంలో కీలకమైన డిసిల్వాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

స్కోరుబోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: రహానె (సి) షాబాజ్‌ (బి) సిరాజ్‌ 9; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి అండ్‌ బి) ఆకాశ్‌ దీప్‌ 10; శ్రేయాస్‌ (సి) డుప్లెసీ (బి) హసరంగ 13; రాణా (సి) విల్లే (బి) ఆకాశ్‌ దీప్‌ 10; నరైన్‌ (సి) ఆకాశ్‌ దీప్‌ (బి) హసరంగ 12; బిల్లింగ్స్‌ (సి) కోహ్లీ (బి) హర్షల్‌ 14; జాక్సన్‌ (బి) హసరంగ 0; రస్సెల్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) హర్షల్‌ 25; సౌథీ (సి) డుప్లెసీ (బి) హసరంగ 1; ఉమేశ్‌ (బి) ఆకాశ్‌ దీప్‌ 18; వరుణ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.5 ఓవర్లలో 128 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-14, 2-32, 3-44, 4-46, 5-67, 6-67, 7-83, 8-99, 9-101, 10-128. బౌలింగ్‌: విల్లే 2-0-7-0; సిరాజ్‌ 4-0-25-1; ఆకాశ్‌ దీప్‌ 3.5-0-45-3; హసరంగ 4-0-20-4; హర్షల్‌ 4-2-11-2; షాబాజ్‌ 1-0-16-0.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసీ (సి) రహానె (బి) సౌథీ 5; అనూజ్‌ (సి) జాక్సన్‌ (బి) ఉమేశ్‌ 0; కోహ్లీ (సి) జాక్సన్‌ (బి) ఉమేశ్‌ 12; విల్లే (సి) రాణా (బి) నరైన్‌ 18; రూథర్‌ఫోర్డ్‌ (సి) జాక్సన్‌ (బి) సౌథీ 28; షాబాజ్‌ (స్టంప్డ్‌) జాక్సన్‌ (బి) చక్రవర్తి 27; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 14; హసరంగ (సి) రస్సెల్‌ (బి) సౌథీ 4; హర్షల్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 19.2 ఓవర్లలో 132/7. వికెట్ల పతనం: 1-1, 2-17, 3-17, 4-62, 5-101, 6-107, 7-111. బౌలింగ్‌: ఉమేశ్‌ 4-0-16-2; సౌథీ 4-0-20-3; రస్సెల్‌ 2.2-0-36-0; నరైన్‌ 4-0-12-1; చక్రవర్తి 4-0-33-1; వెంకటేశ్‌ 1-0-10-0.