రాజస్థాన్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. కనీస ఓవర్ రేటు మెయింటెన్ చేయని కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున 12 లక్షల రూపాయల ఫైన్ వేశారు. తొలిసారి ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు తప్పు చేసిందని, ఐపీఎల్ నియమావళి ప్రకారం కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌పై 12 లక్షల జరిమానా (Kane Williamson Fined Rs 12 Lakh ) విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. స్లో ఓవర్ రేటు విషయంలో (For Slow Over Rate) ఈ సీజన్‌లో ఇది జట్టు మొదటి తప్పు కాబట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం’’ అని పేర్కొంది. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత ఈ తరహాలో ఫైన్ బారిన పడిన రెండో సారథిగా కేన్ విలియమ్సన్ నిలిచాడు.
ఓటమితో ఐపీఎల్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
మ్యాచ్ విషయానికొస్తే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు 61 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అయ్యో కేన్ మామ.. అంపైర్ తప్పిదానికి అప్పుడేమో అనవసరంగా బలయ్యావు.. ఇప్పుడేమో ఇలా జరిమానా.. ఏమిటో! ఇలా జరుగుతోంది’’ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.