Theunis De Bruyn Retires: 30 ఏళ్లకే మరో క్రికెటర్ గుడ్ బై, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా బ్యాటర్ థియునిస్ డి బ్రుయిన్
Theunis De Bruyn Replaces Dean Elgar (Photo Credits: Twitter/ Getty Images)

దక్షిణాఫ్రికా బ్యాటర్ థియునిస్ డి బ్రుయిన్ 30 ఏళ్ల వయస్సులోనే డి బ్రుయిన్ (Theunis De Bruyn Retires) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశీవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. "క్రికెట్‌లో అత్యున్నత స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టం.

చాలా మంది ప్రోటీస్‌ హీరోలతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాను. అదే విధంగా ప్రపంచంలో కొన్ని లీగ్‌ల్లో ఆడాను. అ‍క్కడ కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు మద్దతుగా నిలిచిన దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ధన్యవాదాలు. రాబోయో రోజుల్లో దేశవాళీ టోర్నీలతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌లో మరింత భాగం అవుతాను" అని డి బ్రుయిన్ (South Africa Batter Theunis De Bruyn) పేర్కొన్నాడు.

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన 2007 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ, అన్ని ఫార్మాట్ల నుంచి వెదొలుగుతున్నట్లు ప్రకటన

2017లో దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ ( International Cricket) అరంగేట్రం చేసిన బ్రుయిన్ ప్రోటీస్‌ తరపున 13 టెస్టులు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు కెరీర్‌లో ఒక టెస్టు సెంచరీ కూడా ఉంది. 2018లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో డి బ్రుయిన్ సెంచరీ సాధించాడు.ఇక ఓవరాల్‌గా డి బ్రుయిన్ తన కెరీర్‌లో 496 పరుగులు సాధించాడు.

స్లిప్‌లో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, పైకి జంప్ చేసి క‌ళ్లు చెదిరే రీతిలో అందుకున్న వీడియో ఇదే..

అదే విధంగా ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20లో కూడా డి బ్రుయిన్ ఆడాడు. ఈ టోర్నీలో అతడు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ టోర్నీలో 12 మ్యాచ్‌లు ఆడిన థియునిస్ 238 పరుగులు సాధించాడు.