టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ వెరైటీ షాట్లను మాజీ క్రికెటర్లు కూడా మెచ్చుకుంటున్నారు. గ్రౌండ్‌కు అన్ని వైపులా అతను (Suryakumar Yadav) బాదుతున్న తీరు అందర్నీ స్టన్ చేస్తోంది. వేగవంతమైన స్ట్రయిక్ రేటుతో సూర్య ఆడుతున్న వైనం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని కూడా ఆకట్టుకున్నది. ఈ నేపథ్యంలో సూర్య స్టయిల్‌లా ఆడడం నేర్చుకోవాలని పాక్ ఓపెనింగ్ బ్యాటర్ రిజ్వాన్‌కు సలహా ఇచ్చాడు అఫ్రిది.. నిజానికి రిజ్వాన్ బాగానే ఆడుతున్నప్పటికీ స్ట్రయిక్ రేటు చాలా స్లోగా ఉంది.
అయితే ఇటీవల సామా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన అఫ్రిది.. యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సూర్య బ్యాటింగ్‌ను గుర్తు చేశాడు.సూర్య తరహాలో రిజ్వాన్ ఆడాలా అని వేసిన ప్రశ్నకు అఫ్రిది సమాధానం ఇచ్చాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడటానికి ముందే సూర్య కుమార్ సుమారు 250 దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి ఉంటాడని, అతనికి ఆట స్టయిల్ తెలుసు అని, మంచి బంతుల్ని కూడా అతను టార్గెట్ చేయగలడని అన్నారు.
ప్రాక్టీసు మ్యాచ్ లో రోహిత్ శర్మకు గాయం.. అభిమానుల ఆందోళన
ఎందుకంటే అతను అలా షాట్స్ ప్రాక్టీస్ చేశాడని, ఈ టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్ అలాగే తన గేమ్‌ను డెవలప్ (Afridi wants Rizwan to develop shots) చేసుకోవాలన్నాడు. ఓపెనర్ రిజ్వాన్ రిస్క్ తీసుకుని షాట్లు ఆడాలని అఫ్రిది సలహా ఇచ్చాడు. ఆఫ్‌సైడ్ షాట్లు కొట్టేందుకు రిజ్వాన్ ఇంకా నేర్చుకోవాల్సి ఉందన్నాడు. ప్రాక్టీస్ చేస్తేనే ఆ షాట్లు ఆడే అవకాశం వస్తుందన్నాడు. ఆఫ్‌సైడ్ ఫ్రీగా ఆడేందుకు రిజ్వాన్ ఇబ్బందిపడుతున్నట్లు అఫ్రిది తెలిపాడు. మిడాఫ్, ఎక్స్‌ట్రా కవర్‌లో అతను షాట్లు కొట్టడం నేర్చుకోవాలన్నాడు.
టీమిండియా బ్యాటింగ్ విభాగాన్ని ఉద్దేశించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ లేకపోతే ప్రపంచకప్‌లో భారత జట్టు కనీసం 150 పరుగులు చేసేందుకు కూడా కష్టాపడాల్సి వస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే సందర్భంగా లిటిల్ మాస్టర్ సూర్యకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యకుమార్ ఓ నయా స్టార్ అని ఆకాశానికెత్తాడు. గ్రౌండ్ నలుమూలల్లో అతను ఆడలేని షాట్ లేదంటూ కొనియాడాడు. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని పిలుపించుకోవడానికి అతను వంద శాతం అర్హుడని కితాబునిచ్చాడు.క్రీజ్‌లో కుదురుకుంటే అతను కొట్టలేని షాట్ అంటూ లేదని ప్రశంసించాడు. టెక్నిక్‌తో పాటు భుజబలం అతని ప్రధాన అస్త్రాలని పేర్కొన్నాడు.క్రికెట్ చరిత్రలో కొన్ని షాట్లు ఆడటం సూర్యకుమార్‌కు మాత్రమే సాధ్యపడుతుందని అన్నాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, ఇటీవలి కాలంలో అతనాడిన ఇన్నింగ్స్‌లు చూసిన ఎవరైనా ఇదే విషయాన్ని చెబుతారని తెలిపాడు.