T20 World Cup 2022: ఇండియా, ఇంగ్లండ్ మధ్యనే ప్రపంచకప్ పోటీ, ఆసీస్ ఆటగాళ్లు ఫామ్ కొనసాగిస్తే టైటిట్ వాళ్ళదే, ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్ మైఖేల్ బెవన్ సంచలన వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా వేదికగా ఆక్టోబర్‌ 15 నుంచి టీ20 ప్రపంచకప్‌-2022 ప్రారంభం కానుంది. తొలుత రౌండ్‌ 1 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఆక్టోబర్‌ 22 నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈ మార్క్యూ ఈవెంట్‌ కోసం అన్ని ప్రధాన జట్లు సన్నద్దం అవుతున్నాయి.

T20 World Cup 2022: ఇండియా, ఇంగ్లండ్ మధ్యనే ప్రపంచకప్ పోటీ, ఆసీస్ ఆటగాళ్లు ఫామ్ కొనసాగిస్తే టైటిట్ వాళ్ళదే, ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్ మైఖేల్ బెవన్ సంచలన వ్యాఖ్యలు
Michael Bevan (Photo-Twitter)

ఆస్ట్రేలియా వేదికగా ఆక్టోబర్‌ 15 నుంచి టీ20 ప్రపంచకప్‌-2022 ప్రారంభం కానుంది. తొలుత రౌండ్‌ 1 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఆక్టోబర్‌ 22 నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈ మార్క్యూ ఈవెంట్‌ కోసం అన్ని ప్రధాన జట్లు సన్నద్దం అవుతున్నాయి. ఇక ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్‌ బరిలో నిలిచే మూడు ఫేవరేట్‌ జట్లను ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్ మైఖేల్ బెవన్ ఎంచుకున్నాడు. వాటిలో అతిధ్య ఆస్ట్రేలియా, టీమిండియా, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా అన్ని జట్ల కంటే భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు అద్భుతంగా ఉన్నాయని బెవన్ తెలిపాడు.

విమానం ఎక్కలేదని ప్రపంచకప్ నుంచి హిట్‌మేయ‌ర్ ఔట్, రెండు సార్లు టికెట్ బుక్ చేసినా విమానం ఎక్కకపోవడంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం

"టీ20 ప్రపంచకప్‌-2022 టైటిల్‌ రేసులో భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా నిలుస్తాయని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం జట్లు ఫామ్‌ బట్టి చూస్తే టీమిండియా, ఇంగ్లండ్‌ ముందంజలో ఉన్నాయి. అదే విధంగా ఆస్ట్రేలియాను కూడా తక్కువగా అంచనా వేయకూడదు.ఆస్ట్రేలియా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారు తమ ఫామ్‌ను కొనసాగిస్తే.. ఆసీస్‌కు కూడా టైటిల్‌ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ మెగా ఈవెంట్‌ స్వదేశంలో జరగనుండడం ఆస్ట్రేలియాకు కలిసి వస్తుంది" అని బెవన్ పేర్కొన్నాడు.

(The above story first appeared on LatestLY on Oct 05, 2022 06:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).