విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించిన సంగతి విదితమే. దీంతో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ప్రస్థానం పూర్తిగా ముగిసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటికే పగ్గాలు చేపట్టగా.. టెస్టు సారథి ఎవరన్న అంశంపై త్వరలోనే స్పష్టత (India's next Test captain) రానుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వంటి యువ ఆటగాళ్ల సారథ్యంలో కోహ్లి ఇకపై ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. రాహుల్ నేతృత్వం వహించనున్నాడు. ఈ జట్టులో కోహ్లి సభ్యుడుగా ఉన్నాడు.
తాజాగా కోహ్లీపై టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ మిడ్ డే లో ఆసక్తికర వ్యాఖ్యలు (Kapil Dev issues BOLD statement ) చేశారు. కోహ్లి తన ఇగోను పక్కనపెట్టి (Virat Kohli will have to give up his ego) జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా శ్రీకాంత్, అజారుద్దీన్ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని, అయితే అందుకు ఏమాత్రం ఫీలవలేదని చెప్పుకొచ్చారు. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న నాటి నుంచి అతడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. బ్యాటర్‌గా తను మరింత స్వేచ్చగా ఆడటానికి కెప్టెన్సీ వదులుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఈ ఆప్షన్‌ను తను ఎంచుకోవడం మంచిదేనని కపిల్ దేవ్ అన్నారు.
విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం, టెస్టు కెపెన్సీకి గుడ్ బై, షాక్ లో ఫ్యాన్స్...
కోహ్లీ పరిణతి కలిగిన వాడు. ఇంతటి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటాడు. కెప్టెన్సీని భారంగా భావించినట్లున్నాడు. అందుకే ఇలా చేసి ఉంటాడు. అయితే, ఒక విషయం మాత్రం తప్పక చెప్పుకోవాలి. కోహ్లి ఇప్పుడు తన ఇగోను వదిలేసి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సిన పరిస్థితి. నిజానికి సునిల్ గవస్కర్ నా సారథ్యంలో ఆడాడు. నేను క్రిష్ణమాచారి శ్రీకాంత్, మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఆడాను. నామోషీ అనుకోలేదు. కోహ్లి కూడా అంతే. అహాన్ని పక్కన పెట్టాలి. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేయాలి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లకు అతడు దిశా నిర్దేశం చేయాలి. ఒక బ్యాటర్‌గా కోహ్లి సేవలను కోల్పోవడం అంటే భారత జట్టుకు తీర్చలేని లోటు. కాబట్టి తను ఆడాలి’’ అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.