Jos Buttler (left) and Yuzvendra Chahal (right) (Photo credit: Twitter)

ఐపీఎల్‌-2022లో యజువేంద్ర చహల్‌ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 176 పరుగులు ఇచ్చి 17 వికెట్లు పడగొట్టాడు.కోలకతాతొ జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. ముఖ్యంగా 17వ ఓవర్లో శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ మావి, ప్యాట్‌ కమిన్స్‌ను వరుసగా పెవిలియన్‌కు పంపి తన తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. అంతకు ముందు వెంకటేశ్‌ అయ్యర్‌ను అవుట్‌ చేశాడు. ఇలా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి చహల్‌ కేకేఆర్‌ పతనాన్ని శాసించాడు.

ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించిన చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. భర్త గెలుపును సెలబ్రేట్‌ చేసుకుంటూ సంతోషంతో పొంగిపోయింది. కాగా చహల్‌ హ్యాట్రిక్‌ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ సిబ్బందితో కలిసి చహల్‌ను ఆమె సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ‘‘నేను బబుల్‌ వెలుపల ఉన్నాను కదా? ఎలా అనిపిస్తోంది’’? అని ధనశ్రీ అడుగగా.. ఈ ఫీలింగ్‌ చాలా బాగుందంటూ చహల్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘హ్యాట్రిక్‌ డే కదా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అని ధనశ్రీ అనగానే... అవును మరి మొదటి హ్యాట్రిక్‌ కదా! అంటూ చహల్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Rajasthan Royals (@rajasthanroyals)

ఇక ధనశ్రీతో పాటు ఆమె పక్కనే ఉన్న రాజస్తాన్‌ సిబ్బంది.. ‘‘నువ్వు ఐదు వికెట్లు తీశావు కదా! పర్పుల్‌ క్యాప్‌ తిరిగి వచ్చేసింది. నిజానికి ఈమె కంటే మేమే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాం’’ అంటూ ధనశ్రీని ఉద్దేశించి సరాదా వ్యాఖ్యలు చేశారు. కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌తో ఏకంగా ఐదు వికెట్లు తీసిన చహల్‌.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌-1లో నిలిచి.. పర్పుల్‌ క్యాప్‌ను మరోసారి సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ కేకేఆర్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందింది.