టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఆదివారం గ్రూప్-సి మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో పాపువా న్యూగినీపై విజయం సాధించింది. సెసె బవూ (50; 43 బంతుల్లో 6×4, 1×6) రాణించడంతో న్యూగినీ మొదట 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. రసెల్ (2/19), అల్జారి జోసెఫ్ (2/34), అకీల్ (1/9) ఆ జట్టును కట్టడి చేశారు. రోస్టన్ చేజ్ (42 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 2×6), బ్రెండన్ కింగ్ (34; 29 బంతుల్లో 7×4) మెరవడంతో లక్ష్యాన్ని విండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వీడియో ఇదిగో, ఒమన్ టీంపై నమీబియా సూపర్ విక్టరీ, టీ20 వరల్డ్‌కప్‌లో ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకున్న నమీబియా
పాపువా న్యూగినీ ఇన్నింగ్స్: ఉరా (సి) పూరన్ (బి) షెపర్డ్ 2; వలా (సి) చేజ్ (బి) జోసెఫ్ 21; సైకా (బి) అకీల్ 1; సెసె (బి) జోసెఫ్ 50; హిరిహిరి (సి) పావెల్ (బి) మోటీ 2; అమిని (సి) పూరన్ (బి) రసెల్ 12; దోరిగా నాటౌట్ 27; సోపర్ (బి) రసెల్ 10; నవో రనౌట్ 0; మోరియా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 136; వికెట్ల పతనం: 1-5, 2-7, 3-34, 4-50, 5-94, 6-98, 7-122, 8-130; బౌలింగ్: అకీల్ 3-0-9-1; షెపర్డ్ 3-0-23-1; రసెల్ 3-0-19-2; చేజ్ 4-0-26-0; అల్జారి 4-0-34-2; మోటీ 3-0-24-1
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) సైకా (బి) వలా 34; చార్లెస్ ఎల్బీ (బి) నవో 0; పూరన్ (సి) ఉరా (బి) కారికో 27; చేజ్ నాటౌట్ 42; పావెల్ (సి) దోరిగా (బి) సోపర్ 15; రూథర్‌ఫర్డ్ (సి) దోరిగా (బి) వలా 2; రసెల్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (19 ఓవర్లలో 5 వికెట్లకు) 137; వికెట్ల పతనం: 1-8, 2-61, 3-63, 4-85, 5-97; బౌలింగ్: కబువా 3-0-30-0; నవో 2-1-9-1; సోపర్ 3-0-19-1; సెసె 1-0-18-0; కారికో 4-0-17-1; వలా 4-1-28-2; అమిని 2-0-14-0