ప్రతిష్టాత్మక FIDE Chess Olympiad 2024లో భారత పురుషుల, మహిళల జట్లు రెండు విభాగాల్లోనూ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకున్నారు.బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, ప్రజానంద రమేశ్‌బాబు, విదిత్ గుజరాతితో పాటు తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసితో కూడిన భారత జట్టు 3.5-0.5తో స్లోవేనియాను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.యూఎస్‌ఏ, ఉజ్బెకిస్థాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్ బృందం 3.5-0.5తో అజర్‌బైజాన్‌ను చిత్తు చేసింది. కజకిస్థాన్, యూఎస్‌ఏ రజతం, కాంస్యం గెలిచాయి.
బంగ్లాపై 280 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్
97 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో స్వర్ణం గెలవడం భారత్‌కు ఇదే ప్రథమం. మెన్స్ కేటగిరీలో 2014, 2022 ఎడిషన్లలో భారత్ కాంస్యం గెలవగా ఉమెన్స్ కేటగిరీలో 2022లో కాంస్యం దక్కడమే ఇప్పటిదాకా అత్యుత్తమ ప్రదర్శన. ఒక చెస్ ఒలింపియాడ్ ఈవెంట్‌లో ఒకే దేశానికి (ఓపెన్, ఉమెన్) రెండు స్వర్ణాలు రావడం ఈ టోర్నీ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే.
చెస్ ఒలింపియాడ్‌లో భారత్
2014 పురుషులు కాంస్యం
2022 పురుషులు కాంస్యం
2022 మహిళలు కాంస్యం
2024 పురుషులు స్వర్ణం
2024 మహిళలు స్వర్ణం