 
                                                                 భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం (PV Sindhu Wins Bronze Medal) సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్టే ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం కొద్దిసేపటి క్రితం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హే బింగ్‌జియావో (చైనా)తో జరిగిన పోరులో వరుస సెట్లలో (21-13, 21-15) విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఫలితంగా రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత వ్యక్తిగతంగా రెండు ఒలింపిక్ మెడల్స్ ( First Indian Woman To Win Two Olympic Medals) అందుకున్న అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. నిన్న సెమీస్‌లో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓడిన సింధు నేడు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడింది. పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌తో కనిపించింది. చివరి వరకు అదే ఊపు కనిపించి రెండో సెట్‌ను కైవసం చేసుకున్న సింధు కాంస్యంతో మెరిసింది.కాగా రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు (PV Sindhu) తాజా ఒలింపిక్స్‌లో శనివారం జరిగిన సెమీస్‌లో తైజు యింగ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ సతీశ్ కుమార్ పోరు ముగిసింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జలోలోప్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో పరాజయం పాలయ్యాడు. మూడు బౌట్లలోనూ కనీస పోటీ ఇవ్వని సతీశ్ కుమార్ మొత్తంగా 27 పాయింట్లు సాధించగా.. ప్రత్యర్థి జలోలోప్ మాత్రం 30 పాయింట్లతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
