ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ నెంబర్ వన్ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అభిమానులను నిరాశపరుస్తూ ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది. వీడియోలో ఈ రోజు నేను తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల నా మనసు భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నా.
నిజానికి ఈ విషయం మీతో ఎలా పంచుకోవాలో నాకు అర్థంకాలేదు. అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను. నాకు అన్ని రకాల సంతోషాలు అందించిన ఆటకు సదా రుణపడి ఉంటా. అదే విధంగా నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. సెమీస్ ఆశలు సజీవం, 110 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్ మహిళా జట్టు
25 ఏళ్ల వయస్సులోనే, కెరీర్‌లో అత్యుత్తమ స్థితిలో ఉన్న సమయంలో బార్టీ రిటైర్‌మెంట్ ప్రకటన అభిమానులను షాక్‌కు గురి చేసింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ విజేతగా నిలిచింది.ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన బార్టీ తద్వారా కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ సాధించింది.
View this post on Instagram
అంతేగాక.. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సాధించిన రెండో మహిళా ప్లేయర్(ఆస్ట్రేలియన్)గా బార్టీ రికార్డు సృష్టించింది. యాష్లే బార్టీకి క్రికెట్‌పై మక్కువ ఎక్కువ కావడంతో 2015లో కొన్ని రోజులు ఆమె బిగ్‌బాష్ లీగ్‌లో క్రికెట్ ఆడింది.