File Image | Usain Bolt (Photo Credits: IANS)

ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన జమైకా దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ (Usain Bolt Coronavirus) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కోవిడ్‌ పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘గుడ్‌ మార్నింగ్‌.. నాకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. శనివారం చేసిన పరీక్షలో ఇది బయటపడింది.

నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందువల్ల నేను నా స్నేహితుల నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. అందుకే హోం క్వారంటైన్‌లోకి వెళ్తున్నాను. ఇందుకు సంబంధించిన ప్రొటోకాల్‌ ఏంటనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకోవాలిని భావిస్తున్నాను. నా ప్రజలు అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు బోల్ట్‌.

కాగా గత శుక్రవారం తన 34వ జన్మదినం సందర్భంగా (Usain Bolt birthday party) బోల్ట్‌ భారీ పార్టీ ఇచ్చాడు. దీనికి వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌, ఇంగ్లండ్‌ ఫుట్‌బాలర్‌ రహీమ్‌ స్టెర్లింగ్‌ తదితరులు కూడా హాజరయ్యారు. డ్రీమ్‌ 11 కంపెనీకి ఐపీఎల్ 13వ సీజన్‌ హక్కులు, రూ.222కోట్లతో బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న డ్రీమ్‌ 11

ఆ తర్వాత కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా బోల్ట్‌కు పాజిటివ్‌గా వచ్చినట్టు జమైకాకు చెందిన ఓ రేడియో చానెల్‌ తెలిపింది. తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు ట్విటర్‌లో ఉసేన్‌ వీడియోను పోస్టు చేశాడు. పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో భౌతిక దూరం పాటించకుండా అతిథులతో కలసి బోల్డ్‌ హంగామా చేసిన వీడియోలు, ఫొటోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.