Amaravati, June 21: తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సీఎం నేతలను ఆదేశించారు. జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమం ఉంటుందన్నారు.
‘‘గడప గడపకు కార్యక్రమం అత్యంత కీలకం. ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. చాలా ఉపయోగపడే కార్యక్రమం. వచ్చే 9 నెలలు అత్యంత కీలకం. 175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి. పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోంది’’ అని సీఎం అన్నారు.
‘‘కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టం. సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్‌లు బలంగా ఉండాలి. దీని కోసం గడపగడపకు కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువగా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్ పెరుగుతుంది. పార్టీకి మేలు జరుగుతుంది. అలా జరగకపోతే మార్చక తప్పని పరిస్థితి వస్తుంది’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు.