Amaravati, June 15: ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను (AP Coronavirus) వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 246 మందికి పాజిటివ్ కేసులు (COVID 19 Cases) నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన లెక్కలను పరిశీలిస్తే.. గత 24 గంటల్లో 15,173 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మంది కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు. 47 మంది కోవిడ్ నుంచి తేరుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కర్నూల్, అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. కాణిపాకంలో కరోనా కలకలం, 2 రోజుల పాటు వినాయకుని గుడి మూసివేత, దర్శనాలు రద్దు, ఈ నెల 21వ తేదీన కనకదుర్గ ఆలయం మూసివేత
రాష్ట్రంలో నమోదైన మొత్తం 5087 కేసుల్లో 2770 మంది డిశ్చార్జ్ కాగా 86 మంది మరణించారు. ప్రస్తుతం 2231 మంది చికిత్స పొందుతున్నారు. ఈ కేసుల్లో (Coronavirus In AP) ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,159 మంది ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారి కేసులు 210 ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.
Here's AP Corona Report
#COVIDUpdates: As on 15th June, 10:00AM
COVID Positives: 5087
Discharged: 2770
Deceased: 86
Active Cases: 2231#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/SbnSOP71XM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 15, 2020
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోవిడ్ (జెమ్స్) ఆసుపత్రిలో కరోనా సోకిన గర్భిణికి సిజేరియన్ చేసి పురుడు పోశారు. పసికందుకు నెగిటివ్ రావడంతో తల్లితోపాటు వైద్య సిబ్బంది అంతా ఆనందం వ్యక్తం చేశారు. రేగిడి ఆమదాలవలస కందిత గ్రామానికి చెందిన మహిళ ఇటీవల హైదరాబాద్ నుంచి తన స్వస్థలానికి చేరుకుంది. అప్పటికే ఆమె నిండు గర్భిణి. ఆమె రాగానే వలంటీర్లు మెడికల్ అధికారికి ఫిర్యాదు చేయగా ప్రథమ దశలో హోం క్వారంటైన్‌లో కొన్ని రోజులు ఉంచారు. నేటి నుంచి కర్ణాటకకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్, ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభం, apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం
స్వాబ్ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా ఈనెల 7న నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో గైనికాలజిస్ట్ డాక్టర్ శిరీష ఆమెకు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ఆమె పండంటి ఆడబిడ్డను కన్నది. పుట్టిన బిడ్డకు కరోనా నెగిటివ్ రిపోర్టు రావడంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి సంకోచం లేకుండా ఆపరేషన్ చేసినందుకు వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.