Visakhapatnam, July 9: కలుషిత ఆహారం (Food Poison in AP) తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీలోని మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మగతపాలెంలో (Magatapalem village) చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల ఈ ఘటన జరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఆరోగ్యశ్రీ ఉంటే కరోనా సేవలు ఉచితం, మందుల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది, ఏపీలో ప్రైవేట్ అస్పత్రులకు కోవిడ్-19 ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం
విషయం తెలుసుకున్న ఉప తహసిల్దార్ అప్పల స్వామి బుధవారం అర్థరాత్రి గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన వారందరినీ జి మాడుగుల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరామర్శించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జీ మాడుగుల సీఐ జీడీ బాబు, ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఈ రోజు ఉదయం బాధితులకు పాలు, రొట్టె అందజేశారు.
విశాఖ మన్యంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. విషాహారం తినడంతో గిరిజనులు కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో.. ఆహారం విషయంలో గిరిజనులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.