Srikakulam, April 19: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని (Kasibugga) ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌లకు చార్జింగ్ పెట్టారు. అయితే ఓ బైక్ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు (Fire accident) అంటున్నాయి. క్రమంగా అవికాస్తా పెద్దవికావడంతో షారూం మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హార్డ్‌వేర్ షాప్, వైన్ షాప్‌లకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా భారీగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు.
IPL 2023 :ఉప్పల్ స్టేడియంలో తాగుబోతుల హంగామా.. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ
షోరూంలో ఉన్న 90 బైకులు అగ్నికి ఆహుతయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఎలక్ట్రిక్ బైక్స్ షోరూముల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చార్జింగ్ బైకులు పేలడంతో సికింద్రాబాద్ లోని ఓ హోటల్ లో ప్రాణనష్టం జరిగింది. అయినప్పటికీ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.