Srikakulam kasibugga ci venugopal has-been suspended for attack on man near police station video goes viral (Photo-Video Grab)

Srikakulam, August 5: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో దళితుడిని బూటుకాలితో తన్నిన సీఐ వేణుగోపాల్‌ను (Srikakulam kasibugga ci) పోలీస్ ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని సీరియస్ గా తీసుకున్న ఏపీ డీజీపీ కార్యాల‌యం (AP DGP Office) దీనిపై విచారణ చేపట్టింది. ప్రాథమిక విచార‌ణ జ‌రిపిన అనంత‌రం విశాఖ‌ప‌ట్నం డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాల‌న్‌ను (kasibugga CI Suspended) స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. శిరోముండనం చేసిన ఎస్ఐ అరెస్ట్, దళిత యువకుడిపై అమానుష దాడి, ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

పలాసలో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన దళిత యువకుడిని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో తన్నిన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టెక్కలిపట్నంకు చెందిన మర్రి జగన్ అనే దళిత యువకుడు ఇళ్ల పట్టాల విషయంలో వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప‌లాస మండ‌లం టెక్క‌లి ప‌ట్నంకు చెందిన ర‌మేష్, జ‌గ‌న్ అనే యువ‌‌కుల మధ్య వారి గ్రామంలో గొడవ జ‌రిగింది. ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం కాశీబుగ్గ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విష‌యమై పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన జ‌‌గ‌న్ అనే ద‌ళితుడుని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో త‌న్నారు. ఈ ఘ‌ట‌న వీడియో క్లిప్పింగ్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

Here's Viral Video

ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడి శిరో ముండనం కేసు.. చీరాలలో దళిత యువకుడి మరణం విషయంలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఆ రెండు ఘటనలు మర్చిపోక ముందే మళ్లీ కాశీబుగ్గ సీఐ వ్యవహారం ఏపీలో కలకలంరేపింది.