Chandra babu Naidu (Photo-X/TDP)

స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు సమయంలో అక్కడున్న సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డు కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబును అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్‌ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని ఆయన తరఫు న్యాయవాదులు విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు.

45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, మీరు చూపిన అభిమానం మరువలేనని తెలిపిన చంద్రబాబు

దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు.. పలువురిని సంప్రదిస్తుంటారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో అధికారుల కాల్‌డేటా ఇవ్వడం గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని వాదించారు. ఈ కేసులో ఈనెల 27న వాదనలు పూర్తికాగా.. ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. తీర్పులో ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని, అధికారుల స్వేచ్ఛ, భద్రతకు భంగం కలుగుతుందన్న సీఐడీ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.