Andhra Pradesh Cabinet (photo-X/TDP)

Vjy, June 14: ఏపీ మంత్రులకు ఎట్టకేలకు శాఖలను కేటాయించారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రిత్వ శాఖలు దక్కాయి. పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి & తాగునీటి సరఫరా శాఖలను జనసేన అధినేతకు ఇచ్చారు. అలాగే.. పర్యావరణ, అటవీశాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కూడా ఆయనకే ఇచ్చారు. సాధారణ పరిపాలన, శాంతిభదత్రల శాఖలను చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు.  వీడియో ఇదిగో.. చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు అనే నేను..4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం

ఇక హోం మంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్విస్ట్ ఇచ్చారు చంద్రబాబు. ఎవరూ ఊహించని రీతిలో మహిళ, అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు కేటాయించారు. నారా లోకేష్‌కు మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖలు కేటాయించారు.

మంత్రుల శాఖల వివరాలివే..

నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్

పవన్ కల్యాణ్ : డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు

వంగలపూడి అనిత-హోంశాఖ

నారా లోకేష్‌- మానవ వనరులు,ఐటీ కమ్యూనికేషన్స్‌

ఆనం రాంనారాయణరెడ్డి-దేవాదాయ శాఖ

నిమ్మల రామానాయుడు- జల వనరుల శాఖ

నాదెండ్ల మనోహర్‌- పౌర సరఫరాల శాఖ

పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి శాఖ

కింజరాపు అచ్చెన్నాయుడు- వ్యవసాయశాఖ

డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమ శాఖ

ఎన్‌ఎండీ ఫరూక్‌- మైనార్టీ వెల్ఫేర్‌, న్యాయ శాఖ

కొలుసు పార్థసారధి-హౌసింగ్‌, సమాచార శాఖ

గొట్టిపాటి రవికుమార్‌- విద్యుత్‌శాఖ

పయ్యావుల కేశవ్‌- ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు

కందుల దుర్గేష్‌- పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ

వాసంశెట్టి సుభాష్‌-కార్మిక శాఖ

అనగాని సత్యప్రసాద్‌-రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు

మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి- రవాణా, యువజన,క్రీడల శాఖ

టీజీ భరత్‌- పరిశ్రమలు, వాణిజ్యశాఖ

సత్యకుమార్‌- వైద్య, ఆరోగ్యశాఖ

కొల్లు రవీంద్ర-ఎక్సైజ్‌, గనుల శాఖ

బీసీ జనార్థన్‌రెడ్డి- రోడ్లు, భవనాలు, లిక వసతులు, పెట్టుబడుల శాఖ

గుమ్మడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన శాఖ

ఎస్‌.సవిత- బీసీ సంక్షేమం, చేనేత, ఔళి శాఖ

కొండపల్లి శ్రీనివాస్‌- ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు