Jagananna Thodu: చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో నేడు వడ్డీ జమ, జగనన్న తోడు లబ్దిదారులు మళ్లీ రుణాలు తీసుకునే అవకాశం, 9.05 లక్షల మందికి రూ. 950 కోట్ల రుణాలను అందించిన ఏపీ ప్రభుత్వం
AP CM YS Jagan Mohan Reddy | (Photo-Twitter)

Amaravati, Oct 20: జగనన్న తోడు పథకంలో భాగంగా లబ్దిదారుల వడ్డీ సొమ్మును నేడు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.36 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ (Andhra Govt to deposit interest amount) చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి రూ. 950 కోట్ల రుణాలను అందించింది. తొలి విడత జగనన్న తోడు (Jagananna Thodu) కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.

ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం ద్వారా తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఏటా రూ. 10 వేలు వడ్డీ లేని రుణాలను అందజేస్తోంది. ఈ మొత్తానికి సంబంధించి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. సకాలంలో రుణాన్ని చెల్లించే వారికి తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

రాష్ట్రంలో చిరు వ్యాపారులు వ‌డ్డీ వ్యాపారుల భారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం తీసుకువచ్చింది. దీనిలో భాగంగా తొలిదశలో 2020 నవంబర్‌లో రుణాలు తీసుకుని 30 సెప్టెంబర్, 2021 నాటికి సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వ‌డ్డీ చెల్లించ‌నుంది. జూన్‌ 2021లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్దిదారులకు కూడా వారి రుణ కాల పరిమితి ముగియగానే సదరు వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లించ‌నుంది.

ప్రజలు ఆవేశాలకు గురికావొద్దు, రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీజీపీ సవాంగ్, నేడు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ

జ‌గ‌న‌న్న తోడు పథకం క్రింద బ్యాంకుల్లో ఒక్కోక్క చిరు వ్యాపారికి ఏటా 10 వేల రుపాయిలు వ‌ర‌కు వ‌డ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప‌ది వేల రుపాయిల‌కు ఏడాదికి అయ్యే వ‌డ్డీని ప్రభుత్వం నేరుగా ల‌బ్దిదారుల‌కు అందింస్తుంది. ఇప్పటివరకు మొత్తం 9,05,458 మంది ల‌బ్దిదారుల‌కు రూ. 905 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించింది. బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని ల‌బ్దిదారులు తిరిగి చెల్లించిన తర్వాత మ‌ర‌లా వారు బ్యాంకుల నుండి మళ్ళీ వడ్డీ లేని రుణం తీసుకోవ‌చ్చని ఏపీ సర్కార్ ప్రకటించింది