Anantapur, Nov 2: అనంతపురం రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం ఘోర విషాదం చోటు చేసుకుంది.ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు.పంట కోతల కోసం పని చేస్తుండగా మెయిన్ లైన్ తీగలు ట్రాక్టర్‌పై తెగిపడి ఈ ఘోరం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
మొత్తం 8 మంది ట్రాక్టర్ లో ప్రయాణిస్తుండగా.. ఇద్దరు పురుషులు సహా నలుగురు మహిళలు విద్యుత్ షాక్ కు గురై చనిపోయారు. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన శంకరమ్మ, లక్ష్మి, సరోజమ్మ, వడ్రక్క మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన రత్నమ్మ, పార్వతి తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, ఇద్దరు కార్మికులు మృతి, లోపల చిక్కుకున్న పలువురు కార్మికులు
వర్షం వస్తుండగా ఇక ఇంటికి పోదాం అని కూలీలు భావించిన కాసేపట్లోనే ఈ ఘోరం జరిగిందని దర్గాహొన్నూరు మాజీ సర్పంచ్ ముక్కన్న వెల్లడించారు. ఘటన స్థలం మృతుల బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారింది. తమ వారు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేక కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందర్నీ కలచివేస్తోంది.