
Amaravati, Oct 24: ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,238 కరోనా సాంపిల్స్ పరీక్షలు నిర్వహించగా.. 3,765 మందికి కోవిడ్ పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,00,684గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
కరోనా నుంచి కొత్తగా 4281 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,62,419గా ఉంది. కరోనాతో (Coronavirus) కొత్తగా 20 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,544కు (Covid Deaths) చేరింది. ఏపీలో ప్రస్తుతం 31,721 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 10.85శాతం ఉంది.
ఏపీలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 80,238 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా వచ్చినప్పట్నుంచి ఇదే ఆల్‌టైమ్ రికార్డ్. ఇన్ని పరీక్షలు చేసినా శుక్రవారం నమోదైన పాజిటివ్ కేసులు 3,765. ఇప్పటి వరకు 74,28,014 పరీక్షలు చేయగా, పాజిటివ్ కేసుల సంఖ్య 8,00,684కి చేరింది.
ఒకే రోజు 4,281 మంది కోలుకోగా ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 7,62,419కి చేరింది. తాజాగా 20 మంది మృతితో మొత్తం మరణాలు 6,544కి చేరాయి. యాక్టివ్ కేసులు ఇంకా 31,721 ఉన్నాయి. మిలియన్ జనాభాకు 1,39,101 మందికి పరీక్షలు చేస్తున్నారు.