AP Capital Row: ఏపీ రాజధానిపై కొత్త ట్విస్ట్, అమరావతిని 2015లో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని తెలిపిన కేంద్రం, రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ఎక్కువ మాట్లాడలేమని వెల్లడి
Union Minister of State for Home Nityanand Rai (File Photo/ANI)

Amaravati, Feb 8: విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా (AP Capital Row) అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిందని కేంద్రం పార్లమెంట్‌లో చెప్పింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసిందని... ఆ కమిటీ సూచనలు, సలహాలు, నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా... దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని (Amaravati is the state capital) ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు.

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు, గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు గుర్తించిన వైద్యులు, చెన్నై లేదంటే హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు

అనంతరం ఏపీసీఆర్డీయేను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం 2020లో సీఆర్డీయేను రద్దు చేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొస్తున్నట్టుగా కొత్త బిల్లును తీసుకొచ్చిందని నిత్యానంద్ రాయ్ చెప్పారు. ఆ తర్వాత ఆ బిల్లును వెనక్కి తీసుకుందని, సీఆర్డీయే చట్టానికి కొనసాగింపుగా మరొక బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని... దీనిపై ఇంతకు మించి మాట్లాడితే సబ్ జ్యుడిస్ అవుతుందని అన్నారు. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పారు.

పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే, స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు అధ్యక్షతన సీఎం జగన్ సమావేశం

రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని కేంద్రం ముక్త కంఠంతో చెప్పిందా? అని ఎంపీ విజయసాయి రెడ్డి (YCP MP) ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital Issue) అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్రం పేర్కొంది. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని తెలిపింది.