Volunteers Awards Ceremony: తులసి మొక్కల్లాంటి వ్యవస్థ ఈ వాలంటీర్ల వ్యవస్థ, దీనిపై చంద్రబాబుకు ఎందుకు అంత కడుపుమంట, వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్
CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

AP CM Jagan speech at Volunteer Vandanam Program: ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం జగన్‌ శుక్రవారం శ్రీకారం చుట్టారు.విజయవాడ ఏ ప్లస్‌ కన్వె­న్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తమ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వీళ్లు మంచి సేవకులు, సైనికులు. పేదలకు సేవలు చేసేందుకు 2.66లక్షల మంది సైన్యమే వాలంటీర్‌ వ్యవస్థ. దాదాపు 25 సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపి‍క చేస్తున్నారు’’ అని సీఎం ప్రశంసించారు.ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు వాలంటీర్లు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పున సూర్యుడు ఉదయించకముందే చిక్కటి చిరునవ్వులతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పి ప్రతి అవ్వాతాతకు మంచి మనవడిగా, మనవరాలిగా, ప్రతి వితంతువుకు, వికలాంగుడికి చెల్లెమ్మ-అక్కలా, తమ్ముడు- అన్నలా ప్రతినెలా ఒకటో తారీఖున అక్షరాల 64 లక్షల మందికి ప్రభుత్వ పెన్షన్‌ అందిస్తున్నారని సీఎం అన్నారు.

అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు, తల్లి కోసం హైదరాబాద్ నుంచి పులివెందులకు కడప ఎంపీ, సీబీఐ విచారణకు హాజరు కాలేనని వెల్లడి

కులం, మతం, వర్గం, రాజకీయపార్టీలు చూడకుండా అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుని పథకాలు అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జగనన్న పెట్టుకున్న నమ్మకం వాలంటీర్లు. దేశంలో ఎక్కడకు వెళ్లి చూసినా.. మునుపెన్నడూ చూడని విధంగా ప్రజలకు వాలంటీర్ల ద్వారా మేలు జరుగుతోంది. ఇలాంటి సారథులు, వారధులు దేశంలో ఎక్కడా లేరు. మంచి మనసుతో అనేక మార్పులు తీసుకు వస్తున్నాం. అనేక మార్పులకు సాక్ష్యాలు కూడా వాలంటీర్లే. రాష్ట్రంలో 90శాతం గడపలకు వెళ్లి.. జగనన్న పాలనలో మాదిరిగా ఇలా మీ ఇంటికి వచ్చి ఒకటో తారీఖునే పెన్షన్‌ ఇస్తున్నా ఇలాంటి వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్లపట్టాలు, రైతు భరోసా.. ఇలా అందించడాన్ని గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా? అని అడిగే నైతికత మీకు మాత్రమే సొంతం’’ అని సీఎం అన్నారు.

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ వార్తలు అబద్ధం, సేవలు యథాతధంగా కొనసాగుతాయని తెలిపిన ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌, రూమర్స్ నమ్మవద్దని వెల్లడి

గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల అరాచకాలు చూశారు. వివక్ష, లంచాలు చూశాం. మన అందరి ప్రభుత్వం తీసుకు వచ్చిన తులసిమొక్కల్లాంటి వ్యవస్థే వాలంటీర్ల వ్యవస్థ. 25 పథకాలకు సంబంధిచిన బ్రాండ్‌ అంబాసిడర్లు వాలంటీర్లు. చేస్తున్న మంచిని చూసి, నవరత్నాల పాలనను చూసి, 2.10 లక్షల కోట్లు డీబీటీని చూసి గతంలో ఎప్పుడూ మంచిచేయని చరిత్ర ఉన్నవారు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎల్లోమీడియా, సోషల్‌ మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పేదల ప్రభుత్వంమీద గిట్టని వారు తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్తున్నారు. నిందలు వేస్తున్నారు’’ అని సీఎం మండిపడ్డారు.

‘‘5 కోట్ల ప్రజల ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారధులు మీరు. ప్రతి గడపకూ నేరుగా వాలంటీర్లే మనకున్న బలం. ప్రతి గడప వద్దకూ వెళ్లి.. ప్రతి అక్కను కూడా నీకు ఈ మంచి జరిగిందా? లేదా? అని నీతిగా, నిజాయితీగా అడగగలిగే నైతికత ఈ ప్రభుత్వానికి ఉంది. అది వాలంటీర్ల వల్లే సాధ్యపడింది. ఎక్కడా మంచే తప్ప, చెడు చేయలేదు. ఈ ప్రభుత్వం ఫిలాసఫీకి ప్రతిరూపం వాలంటీర్లు. ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు చేస్తున్నది సేవ. ప్రభుత్వం ఉద్యోగం పరిధిలోకి వచ్చేది కాదు. ఇది వాలంటీర్‌ సేవ. ఇక్కడ పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాలంటీర్‌ కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలి అనే మనస్సు పెట్టి తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మంచి మనుషులు. కాబట్టి.. ఎవరైనా మీరు చేయాల్సిన పనికాదు.. అని ఎవరైనా అంటే.. గట్టిగా సమాధానం చెప్పాల్సిన పని ఉంది’’ అని సీఎం అన్నారు.

వాలంటీర్‌ కార్యక్రమం మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని చెప్తున్నాను. వాలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోంది?. మిమ్మల్ని లీడర్లుగా చేస్తానని చెప్పాను. ఆ మాటను గుర్తు పెట్టుకోండి. ప్రజలందరికీ కూడా మోటువేటర్లు, ప్రభుత్వానికి అండగా నిలబడాలని పిలుపునిస్తున్నాను. ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రతి ఒక్కరికీ మంచిచేస్తోంది. ఏ పేదవాడు కూడా మిస్‌ కాకూడదన్న ఉద్దేశంతో పనిచేస్తోంది.

నవరత్నాల ఫిలాసఫీ వల్లే ఇదంతా జరుగుతోంది. వాలంటీర్ల సేవలకు ఇస్తున్న గుర్తింపుగా ఈ కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా వాలంటీర్ల సేవలకు గుర్తింపు ఇచ్చేలా కార్యక్రమం ఉంటుంది. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు వాలంటీర్‌ వ్యవస్థ అంటే కడుపులో మంట. డజన్‌ జెల్యుసిల్‌ మాత్రలు వేసినా కూడా తగ్గని మంట. వాలంటీర్ల మీద నిరంతరం దుష్ప్రచారం, విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు వీళ్లు మనుషులేనా’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

‘‘ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ డబ్బులు చేతిలోపెట్టి.. ఆప్యాయతలు చూపించే వాలంటీర్ల మీద చంద్రబాబు, ఆయనకు సంబంధించిన ఎల్లోమీడియా వెటకారం చేస్తూ… ఏం అన్నారో బాగా గుర్తుకుపెట్టుకోండి. దురుద్దేశాలు ఆపాదించే చంద్రబాబు గురించి బాగా గుర్తు పెట్టుకోండి. వాలంటీర్లను చులకనగా చూపించేందుకు మద్యం తాగుతారని, మూటలు మోస్తారని, అల్లరి మూకలని కూడా చంద్రబాబు అన్నాడు. వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి.. తిరిగి జన్మభూమి కమిటీలను తెస్తానన్నాడు. కోర్టులకు వెళ్లి… అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

వాలంటీర్ల సేవలను ప్రజలు గుర్తించగానే, ఇదే చంద్రబాబు.. ఈ వాలంటీర్లు అంతా జగన్‌ సైన్యం.. వీరు వద్దు అన్నాడు. జన్మభూమి కమిటీలతో దోపిడీ సైన్యాన్ని తీసుకు వస్తానంటూ చంద్రబాబు అన్నాడు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి, మంచి చేస్తున్న ముఖ్యమంత్రికి బ్రాండ్‌ అంబాసిడర్లే వాలంటీర్లు. జగనన్న సైన్యం వాలంటీర్లు. ప్రతి ఇంటికీ ఎక్కువసార్లు వెళ్లాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలి. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదే’’ అని సీఎం జగన్‌ అన్నారు.