Andhra Pradesh: రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పని చేస్తా, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవింద్‌రెడ్డి, జగన్‌తోనే నా జీవితమన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
APIIC Chairman Mettu Govinda Reddy (Photo-Video Grab)

Amaravati, April 20: ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవింద్‌రెడ్డి సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పనిచేయనున్నట్లు ఆయన (APIIC Chairman Mettu Govinda Reddy) వెల్లడించారు. ఏప్రిల్‌ నుంచి తన వేతనం రూ.65వేలు, ఇతర అలవెన్సులు ఇవ్వొద్దంటూ ( will Serve Without Salary) ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యంకు ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డి  టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత గత ఏడాది జూలైలో ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఆయన్ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డిని నియమించారు. కాగా 2021 జూలై 17న ఏపీ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు.

విశాఖలో ఏపీ సీఎం జగన్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ, పలు కీలక అంశాలు చర్చకు..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమదని, తాను ఎప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విధేయుడినేనని శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. కొన్ని మీడియా సంస్థల్లో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమైనవని అన్నారు. తాను వైఎస్సార్‌సీపీకి వీర సైనికుడినని, తనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు, శాప్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారన్నారు. తనకు ఇంత చేసిన పార్టీని తానెందుకు వీడుతానని, మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలన్నారు. తాను ఎప్పటికీ వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విధేయుడనేనని మరోసారి స్పష్టం చేశారు.