Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Amaravati, Feb 28: మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను ఈ స‌మావేశాల్లోనే (AP Assembly Budget Sessions 2022) ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. 9,10 తేదీల్లో గ‌వ‌ర్న‌ర్ ప్రసంగానికి ధ‌న్య‌వాదాలు తెల‌ప‌నున్నారు. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఈ స‌మావేశాల‌ను ఏకంగా మూడు వారాల పాటు నిర్వ‌హించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభానికి ముందు జ‌ర‌గ‌నున్న బీఏసీ స‌మావేశంలో నిర్ణ‌యించ‌నున్నారు. ఈ విష‌యం అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభానికి ముందు జ‌ర‌గ‌నున్న బీఏసీ స‌మావేశంలో (BAC Meeting) నిర్ణ‌యించ‌నున్నారు.

ఆ త‌ర్వాత మార్చి 11 లేదా 14 తేదీల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వార్షిక బడ్జెట్‌ను (AP Budget) అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు రూ.2.30 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశముంది. ఇప్పటికే బడ్జెట్ పై అన్ని శాఖల కసరత్తు దాదాపు పూర్తైంది. ఈసారి బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం వైఎస్ జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వ్యవసాయం పాడి పరిశ్రమపై దృష్టిపెడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలు, 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ చేపట్టిన ఏపీ ప్రభుత్వం

తెలుగుదేశం (TDP) పార్టీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు (Chandra Babu Naidu) మాత్రం సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా తాము సభకు వెళ్లమని చెబుతుండటంతో వారికి చంద్రబాబు సర్దిచెబుతున్నారు. గత అసెంబ్లీ సమయంలో చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభకు వస్తానని శపథం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తిరిగి ఎన్నికలు జరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంతవరకు చంద్రబాబు సభకు వచ్చే అవకాశం లేదు. అయితే అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సైతం తాము సభకు దూరంగా ఉంటామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజా సమస్యలను సభకు వెళ్లి ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు.