AP Bagged 17 Panchayat Awards: దుమ్మురేపిన ఏపీ పంచాయితీ వ్యవస్థ, దేశ స్థాయిలో 17 అవార్డులు కైవసం, దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ, ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ
AP Bagged 17 Panchayat Awards (Photo-Twitter)

Amaravati, April 24: ఏపీ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో (National Panchayat Awards 2021) ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 17 అవార్డులను (AP Bagged 17 Panchayat Awards) దక్కించుకుంది. పంచాయతీరాజ్‌ దినోత్సవం (National Panchayat Day) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రదానం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి 17 అవార్డులు వచ్చాయని.. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ అని ఆయన పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు అవార్డు వచ్చిందన్నారు.

జాతీయ పంచాయ‌తీరాజ్‌దినోత్స‌వం సంధర్భంగా స్వ‌మిత్వ ప‌థ‌కం ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ప్రాప‌ర్టీకార్డుల‌ను అందుకోనున్న 4.09 ల‌క్ష‌ల మంది ఆస్తి స్వంత‌దారులు

మహాత్మా గాంధీ స్ఫూర్తితో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని.. గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లకు అవార్డులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.