Andhra Pradesh: మనుషుల మీద దాడి చేసిన ఎలుగుబంటి చికిత్స పొందుతూ మృతి, పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపిన జూ అధికారులు

శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులు నుంచి అక్కడి పరుగులు పెట్టించిన చికిత్స పొందుతూ ఎలుగుబంటి ప్రాణాలు ( bear deceased) కోల్పోయింది.

Andhra Pradesh: మనుషుల మీద దాడి చేసిన ఎలుగుబంటి చికిత్స పొందుతూ మృతి, పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపిన జూ అధికారులు
Rescue team catches Bear (Photo-Video Grab)

Srikakulam, June 21: శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులు నుంచి అక్కడి పరుగులు పెట్టించిన చికిత్స పొందుతూ ఎలుగుబంటి ప్రాణాలు ( bear deceased) కోల్పోయింది. సోమవారం పలువురిపై దాడి చేసి గాయపరిచిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అయితే అస్వస్థతకు గురయిన ఎలుగుబంటి రెస్య్కూ సెంటర్‌లో చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది.

అయితే ఎలుగుబంటి మృతిపై కారణాలు తెలియాల్సి ఉందని జూ అధికారులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆదివారం కిడిసింగిలో జీడి రైతు కోదండరావుపై దాడిచేసి ప్రాణాలు తీసిన ఈ ఎలుగుబంటి సోమవారం ఆరుగురిని గాయపరచడంతో ఉద్దానమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.

(The above story first appeared on LatestLY on Jun 21, 2022 07:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).