Narayana College Buses Burnt (Photo-Video grab)

Visakhapatnam, Jan 28: విశాఖ జిల్లా పెందుర్తిలో అగ్ని ప్రమాదం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల బస్సులు (Narayana College buses) అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా (Narayana College Buses Burnt) కాలిపోయాయి.అయితే ఒకేసారి మూడు బస్సులు మంటల బారిన పడటానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందులో కుట్ర కోణం దాగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు.

కాగా పార్క్ చేసిన బస్సులు దగ్ధం అవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సులు నిలిపి ఉంచిన స్థలంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పార్కింగ్‌లో ఉన్న మిగిలిన బస్సులను పక్కకు తీయడంతో ప్రమాద తీవ్రత కాస్త తగ్గింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్‌‌ను తిప్పి పంపిన ఏపీ ప్రభుత్వం, ఎస్‌ఈసీకి ఆ అధికారం లేదని వెల్లడి, గవర్నర్‌తో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

నారాయణ విద్యాసంస్థలకు చెందిన బస్సులు ఎప్పుడూ పెందుర్తిలో (Pendurthy) పార్క్ చేస్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని పూర్తిస్థాయిలో యాజమాన్యం వినియోగించట్లేదు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఆ బస్సులను బయటికి తీస్తున్నారు. కొంతకాలంగా అవన్నీ పెందుర్తిలోని ఖాళీ ప్రదేశంలోనే ఉంచారు. పార్క్ చేసి ఉంచిన బస్సుల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. పక్కపక్కనే ఉన్న మూడు బస్సులు దగ్ధం అయ్యాయి.

మరోవైపు, విశాఖపట్నంలోని పారామౌంట్ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో బుధవారం రాత్రి మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్తి నష్టం రూ. 10 కోట్లని అంచనా. సంస్థలోని ఆయిల్ స్టోరేజ్ సదుపాయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం.